‘‘నేను నటిని మాత్రమే కాను. తెర మీదే కాదు.. తెర వెనుకా నావి చాలా పాత్రలు ఉన్నాయి. వాటిని సాకారం చేసుకునేందుకు కలలు కంటున్నాను. ఏదో ఒకనాడు అవన్నీ సాకారమవుతాయి’’ అంటున్న అనుపమా పరమేశ్వరన్. తెలుగులో వరుస హిట్లు ఇస్తున్న హీరోయిన్‍గా పేరొందిన ఆమె ఇటీవలే ‘రాక్షసుడు’తో మరో హిట్ కొట్టింది. ‘తెలుగు పత్రిక’ ఆమెతో చేసిన చిట్‍చాట్..
మీరు ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తుంటారు. ఇబ్బంది అనిపించదా?
ఈ రోజుల్లో ఒకేసారి రెండు మూడు సినిమాలు చేసే అవకాశాలు ఎవరికి వస్తున్నాయి? నాకు వస్తున్నాయి అంటే ఆనందమే కదా? ఇందులో ఇబ్బంది ఏముంది? నటిగా నాకు డిమాండ్ ఉంది కాబట్టి అవకాశాలు వస్తున్నాయి. వచ్చిన వాటిలో నచ్చిన పాత్రలు చూసుకుని సెలెక్టివ్‍గా చేసుకుంటూ వెళ్తున్నా. పైగా ఒకేసారి నాకు రెండుమూడు పనులు చేయడం ఇష్టం కూడా.
నటిగా మారాక వచ్చిన మార్పు..?
ఏం లేదు. ఇంకా చెప్పాలంటే నేను నటి కంటే ముందు, నేనొక నవ తరం అమ్మాయిని. ఒక పనికో, ఒక వ్యాపకానికో పరిమితం కావడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ఒకేసారి రెండు మూడు సినిమాల్లో నటిం చడమే కాదు.. పనులు చేయడానికి కూడా నేను ఇష్టపడతాను. చదువు కుంటూనే సినిమాల్లోకి వచ్చాను. అక్కడా, ఇక్కడా కూడా ఇబ్బంది అనిపించలేదు.
షూటింగ్ గ్యాప్‍లో మీరు కుదురుగా ఉండరని అంటారు?
అవును. నటిగా కొనసాగుతున్నా ఇంకా చాలా విషయాలు తెలుసు కోవాలని నాకు అనిపిస్తుంటుంది. అందుకే సెట్‍లో ఉన్నప్పుడు ఒకచోట కుదురుగా ఉండను. కెమెరా వెనుక ఏం జరుగుతోంది? ఎలా షూట్ చేస్తున్నారు? ఏ పని కోసం ఎవరు ఎలా కష్టపడుతున్నారు? వంటివన్నీ అబ్జర్వ్ చేస్తుంటాను.
చాలా కలలున్నాయంటున్నారు.. అవేమిటో?
చాలా కలలున్నాయి. కానీ ప్రస్తుతానికి దర్శకురాలిని కావాలనే కలగంటున్నా..
కలగంటున్నా…అనుపమ పరమేశ్వరన్

Review కలగంటున్నా…అనుపమ పరమేశ్వరన్.