తెలుగులో ఎడాపెడా అగ్రహీరోలతో, వర్ధమాన హీరోలతో నటిస్తూ ఆకట్టుకుంటున్న కీర్తిసురేశ్ చిన్నప్పటి ముచ్చట్లు బాగానే చెప్పుకొస్తోంది. ‘మా అమ్మతో బాల్యంలో చేసిన ఓ చాలెంజ్ చేశాను. అది ఇప్పటికి గెలిచాను’ అంటూ సంబరపడుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే, కీర్తి తల్లి మేనక అలనాటి నటి. కీర్తి తన చిన్నప్పుడు హీరో సూర్యకు అభిమాని. ఆ సమయంలో ఆయన తండ్రి శివకుమార్‌తో మేనక మూడు సినిమాలు చేశారు. ‘ఏదో రోజు నేనూ వాళ్లబ్బాయితో కలిసి నటిస్తాను’ అని ఆ సమయంలో మా అమ్మతో అన్నా. అన్నట్టుగానే ఇప్పుడు సూర్యతో కలిసి ‘తానా సేంద కూట్టమ్’ (తెలుగులో ‘గ్యాంగ్’) చిత్రంలో నటించా. ఆ విధంగా చిన్నప్పుడు మా అమ్మతో చేసిన చాలెంజ్ ఇప్పటికి నిజమైంది’ అంటూ అసలు సంగతి చెప్పింది. ఆమె ప్రస్తుతం తెలుగులో పవన్కల్యాన్తో కలిసి ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో తెర పంచుకుంది.
చాలెంజ్ గెలిచిన కీర్తిసురేశ్…

Review చాలెంజ్ గెలిచిన కీర్తిసురేశ్….