చిట్టిబాటు మాంచి హుషారు మీద ఉన్నాడు. ఓ పాట పాడుకోవాలని అనిపించింది. వెంటనే అందుకున్నాడు. అంతేకాదు. అదే ఊపు మీదు స్టెప్పులు కూడా వేశాడు. అతను డ్యాన్స్ చేయడం చూసి పక్కనే ఉన్న సుందరాంగి కూడా చెట్టాపట్టాలు కట్టింది. వీళ్లిద్దరినీ చూసి ఊరు ఊరంతా పదం కలుపుతూ పాదం కలిపింది. ఇంకేముంది.. కట్ చేస్తే అందమైన పాట. ఇదంతా ‘రంగస్థలం’ సినిమాలోని ఓ పాట సన్నివేశం. చిట్టిబాబుగా రామ్‍చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో ఈ పాటలో అతని పక్కన కన్నడ భామ పూజాహెగ్డే తళుక్కున మెరిసింది. దాదాపు 200 మంది డ్యాన్సర్లతో ఈ పాటను చిత్రీకరించారు. ఇందుకోసం భారీ సెట్‍ను వేశారు. ఈ పాట ‘రంగస్థలం’లో స్పెషల్ సాంగ్ కానుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ పాట చిత్రీకరణలో ‘రంగస్థలం’ సినిమా దాదాపు పూర్తి కావచ్చినట్టే. ఈ మార్చిలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్‍చరణ్ సరసన సమంత నటిస్తుండగా, దేవీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. 1985 ప్రాంతం నాటి వాతావరణం, నేపథ్యంతో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు.
చిట్టిబాటు ఆటపాట…

Review చిట్టిబాటు ఆటపాట….