‘బాహుబలి’ తరువాత ప్రభాస్ హీరోగా వస్తున్న ‘సాహో’ అత్యంత భారీ బడ్జెట్‍తో రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రంలోని కీలకమైన ఓ యాక్షన్ సీన్ దాదాపు 20 నిమిషాల పాటు ఉంటుందట. దీని కోసం చిత్రం యూనిట్ దుబాయ్‍లోనే మకాం వేసింది. లొకేషన్స్ ఎంపిక కోసం చిత్రం యూనిట్ ఇప్పటికే ఎనిమిది సార్లు దుబాయ్ వెళ్లిందట. నెలన్నర నుంచి ఈ చిత్రం ఆర్ట్ డైరెక్టర్ సాబు శిరిల్ సెట్ కోసం స్కెచ్ వేస్తున్నారట. ఈ యాక్షన్ పార్ట్ ఆర్ట్ డిజైన్ కోసం దాదాపు 300 మంది పనిచేస్తున్నారట. భారత్ నుంచి ఈ సీన్ షూటింగ్ కోసం 4 భారీ కంటైనర్లతో సామగ్రిని కూడా తీసుకువెళ్లారట. దీన్ని బట్టి దుబాయ్‍లో ఎంత భారీ సెట్ వేశారో అర్థం చేసుకోవచ్చు. ‘బాహుబలి’ మేనియా తరువాత వస్తున్న ప్రభాస్ చిత్రం కావడంతో ‘సాహో’పై భారీ అంచనాలే ఉన్నాయి.
దుబాయ్‍లో ‘సాహో’

Review దుబాయ్‍లో ‘సాహో’.