జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో రూపుదిద్దు కుంటున్న ‘జై లవకుశ’ టీజర్ ఇటీవల విడుదలైంది. అందులో ఎన్టీఆర్ – ‘ఆ రావణుణ్ణి చంపాలంటే సముద్రం దాటాలి.. ఈ రావణుణ్ణి చంపాలంటే సముద్రమంత ద్ద..ద్ద..ధైర్యం ఉండాల!
ఉందా?’- అంటూ పలికిన డైలాగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ విషయంలోనే వివాదం చెలరేగుతోంది. తన స్క్రిప్ట్ చోరీ జరిగిందని, తాను గతంలో ఎన్టీఆర్‍కు చెప్పిన లైన్ తీసుకునే ‘జై లవకుశ’ తెరకెక్కిస్తున్నారని దర్శకుడు పూరీ జగన్నాథ్ బాహాటంగానే ప్రకటించారని ఆంగ్ల దినపత్రికలో వచ్చింది. ‘జై లవకుశ’లో ఎన్టీఆర్ మూడు క్యారెక్టర్లు చేస్తున్నారు. ఇందులో ‘జై’ క్యారెక్టర్ రావణుడి భక్తుడి పాత్ర. ఇది పూరి కాన్సెప్ట్ అని, దాన్ని కాపీ కొట్టి ‘జై లవకుశ’లో పెట్టారని ఫిల్మ్నగర్ టాక్. దీంతో ఇప్పుడంతా ‘చ్చో..చ్చో..చోరీ జరిగిందా?’ అనేది వాడివేడిగా చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే, ‘జై లవకుశ’లోని మిగతా రెండు క్యారెక్టర్లకు సంబంధించిన టీజర్లు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అని ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ద్ద..ద్ద..ధైర్యం ఉండాలా! ఉందా

Review ద్ద..ద్ద..ధైర్యం ఉండాలా! ఉందా.