నలభై కోట్లు చాలట!

కుటుంబ కథా చిత్రాలతో పాటు యాక్షన్‍ మూవీస్‍లో నటించి అగ్ర కథానాయ కుడిగా వెలుగొందిన జగపతిబాబు ఇప్పుడు సహాయక పాత్రల్లో, ప్రతినాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు చిత్రసీమలో ముక్కుసూటిగా ఉంటారని, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారని ఆయనకు పేరు. ‘నాన్నకు ప్రేమతో..’ ‘శ్రీమంతుడు’, ‘మన్యంపులి’ వంటి హిట్‍ చిత్రాలలో పాలుపంచుకున్న ఆయన చాలా కాలం తరువాత ‘పటేల్‍ సార్‍’ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో ఆయన లుక్‍, స్టైల్‍ చాలా డిఫరెంట్‍గా ఉన్నాయని అంటున్నారు. ఈ లుక్స్ని బట్టి, సినిమా టైటిల్‍ను బట్టి ఆయన ‘పటేల్‍ సార్‍’లో గ్యాంగ్‍స్టర్‍గా నటిస్తున్నారనే టాక్‍ కూడా వినిపిస్తోంది. ఇదే విషయమై జగపతిబాబును అడిగితే.. ‘ఇది మంచి కుటుంబ అనుబంధాలను ప్రతిబింబించే సినిమా’ అని చెప్పారు. ఒకానొక దశలో సినిమాలు లేక, ఇబ్బంది పడిన ఆయన ఇప్పుడు విలన్‍, సహాయక పాత్రల్లో నటిస్తూ.. నిలదొక్కుకున్నారు. ‘లెజెంట్‍’ తరువాత ఆర్థికంగా స్థిరపడినట్టున్నారు? అని అడిగితే.. డబ్బుల గురించి తానెప్పుడూ ఆలో చించలేదని చెప్పారు. ‘కోట్లకు కోట్లు సంపాదించినా ఏం చేసుకొంటాం? నా వరకు నాకు ఓ నలభై కోట్ల రూపాయలు సంపాదిస్తే చాలనిపిస్తోంది. ఎందుకంటే మా ఇంట్లో నలుగురం ఉన్నాం. అందరికీ కలిపి ఈ మొత్తం చాలు. అంతకంటే ఎక్కువ సంపా దించడంలో అర్థం లేదు’ అని వివరించారాయన.

Review నలభై కోట్లు చాలట!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top