
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున తన తీరని కోరికను ఇటీవల బయట పెట్టారు. అది- రాజమౌళి దర్శకత్వంలో నటించడం. ‘రాజమౌళి దర్శకత్వంలో పని చేయాలనేది కోరికగానే మిగిలిపోయింది. అప్పుడెప్పుడో ‘రాజన్న’ చిత్రానికి రాజమౌళి కొన్ని సన్నివేశాలకు దర్శకత్వం వహించినా అది ఆయన పూర్తి స్థాయి దర్శకత్వం వహించిన చిత్రం కాదు. ఇంకోసారి ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రాలేదు. ఏమైతేనేం. నాన్న గారి పేరుతో ఉన్న ఏఎన్నార్ జాతీయ అవార్డును ఈ ఏడాది దర్శకుడు రాజమౌళికి ఇవ్వాలని నిర్ణయించాం. ఇందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. తెలుగు వారు గర్వపడే సినిమా తీసిన ఆయన (రాజమౌళి) నిజంగా బాహుబలే’ అన్నారు నాగార్జున. ఇటీవల ఏఎన్నార్ అవార్డు బహూకరణ ఫంక్షన్కు సంబంధించిన ప్రెస్మీట్లో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
Review నాగార్జున తీరని కోరిక.