చిత్రలహరి’ గుర్తుందా? కేబుల్ టీవీ రాకముందు దూరదర్శన్‍లో వారానికి ఒకసారి వచ్చే పాటల పోగ్రామ్ ఇది. ఇప్పుడు అదే టైటిల్‍తో నాని హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ వంటి హృదయాలను హత్తుకునే చిత్రాలను తెరకెక్కించిన కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ మూవీకి దాదాపుగా ఇటే టైటిల్ కన్‍ఫర్మ్ అయినట్టు చెబుతున్నారు. కాగా, నాని ప్రస్తుతం ‘కృష్ణార్జున యుద్ధం’ షూటింగ్‍లో బిజీగా ఉన్నాడు. అలాగే, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో హీరో నాగార్జునతో కలిసి మల్టీస్టారర్ చేయనున్నాడు. ఇటీవలే నాని నటించిన ‘ఎంసీఎ’ విడుదలైన విషయం తెలిసిందే. వరుస సినిమాలతో నాని తీరిక లేనంతగా బిజీ అయిపోతున్నాడు.
నాని ‘చిత్రలహరి’

Review నాని ‘చిత్రలహరి’.