‘మాస్ మహారాజ్ సినిమా వచ్చి మళ్లీ చాలా రోజులై పోయింది. కెరీర్‍లో చాలా గ్యాప్ తరువాత ‘రాజా ది గ్రేట్’ అంటూ అభిమానులను పలకరించిన రవితేజ తాజాగా ‘నేల టికెట్’ చిత్రంలో నటిస్తు న్నాడు. రవితేజ పలికే డైలాగ్స్లోనే కాదు.. చేసే డ్యాన్స్లోనూ మాస్ పల్స్ భలేగా ఉంటుంది. తాజా చిత్రంలో అతనిపై చిత్రీకరిస్తున్న మాస్ సాంగ్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టు కుంటుందని చిత్ర బృందం ముందే చెప్పేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ‘నేల నేల నేల నేల టికెట్’ అనే మాస్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. మాళవికా శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‍ఆర్‍టీ ఎంటర్‍టైన్‍మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. త్వరలోన విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ద్వారా రవితేజ కెరీర్ మళ్లీ ఊపందుకుంటుందని అంటున్నారు. ఈ చిత్రం తరువాత శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రాన్ని చేయనున్నాడు. దీని తరువాత సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో చిత్రం రానుంది. చూస్తుంటే ‘నేల టికెట్’ రిలీజ్ కంటే ముందే రవితేజ కెరీర్ మళ్లీ ఊపందుకున్నట్టే కనిపిస్తోంది కదూ!
నేల నేల నేల టికెట్…

Review నేల నేల నేల టికెట్….