
రామ్‌చరణ్ ఇప్పటి వరకు సిటీ బుల్లోడు తరహాలోనే దాదాపు అన్ని సినిమాలు చేశాడు. ఆ మధ్య వచ్చిన ‘గోవిందుడు అందరివాడు’లో పల్లెటూరి యువకుడిలా కనిపించినా.. అటు తరువాత మళ్లీ పూర్తి స్థాయి పల్లెటూరి కుర్రోడు పాత్రలో ‘రంగస్థలం’లో కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం గెడ్డం కూడా పెంచిన రామ్ చరణ్.. వెరైటీ గెటప్‌లో కనిపిస్తున్నాడు. సమంత కథానాయిక. 1985 నాటి నేపథ్యంతో ఈ సిని మాను తెరకెక్కిస్తుండటం, దీనికి సుకుమార్ దర్శ కుడు కావడంతో ‘రంగస్థలం’ ఆసక్తి రేకెత్తిస్తోంది. తన పాత్ర పూర్తిగా తూర్పుగోదావరి జిల్లా శైలిలో ఉండనున్నదని రామ్‌చరణ్ చెబుతున్నాడు. అలా అని ఇదేమీ ప్రయోగాత్మక చిత్రం కాదని, అన్ని కమర్షియల్ హంగులు ఉంటాయని అంటు న్నాడు. అభిమానులకు, ప్రేక్షకులకు సరికొత్త అను భూతిని పంచే రీతిలో సుకుమార్ సినిమాను రూపొందిస్తున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాకు దేవిశీప్రసాద్ సంగీత దర్శకుడు. డిసెంబరు నాటికి ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకోనుంది.
Review పల్లెటూరి ‘రంగస్థలం’.