పుస్తకాలతోనే ‘క్రష్‍’

రష్మిక.. ‘పుష్ప’లో శ్రీవల్లిగా అలరించిన ఈ చిన్నది పుస్తకాల పురుగు కూడా. ఎప్పుడూ సినిమా కబుర్లేనా.. నేను చదివే పుస్తకాలేంటో.. వాటి సారాంశమేంటో తెలుసుకోండంటూ బోలెడు ముచ్చట్లు చెప్పింది. పుస్తకాలంటే ఎంతో ఇష్టమని చెప్పే ఆమె.. షూటింగ్‍ గ్యాప్‍లో ఏ మాత్రం ఖాళీ దొరికినా పుస్తకాన్నందుకుంటానని చెబుతోంది. ‘నేను చదివి ప్రేరణ పొందిన పుస్తకాలివీ.. మీరు చదవండి’ అంటూ రష్మిక సిఫార్సు చేస్తున్న ఆ పస్తుకాలేమిటో చూద్దాం..
ద లిటిల్‍ బిగ్‍ థింగ్స్

కాలికి చిన్నముల్లు గుచ్చుకుంటేనే విలవిల్లాడిపోతాం.. ఒంట్లో నలతగా ఉంటే ఏదో అయిపోయినట్టు కుంగిపోతాం. అలాంటిది భుజాల కింది భాగం మొత్తం పక్షవాతానికి గురై అచేతనులైతే.. ఇక జీవితమే లేదనుకుంటాం. కానీ, హెన్నీప్రాసెర్‍ ప్రతిరోజునూ పండుగలా జరుపుకున్నాడు. పదిహేడేళ్లప్పుడు జరిగిన ప్రమాదంలో శరీరంలోని సగభాగం చచ్చుబడిపోయింది. అయినా డీలా పడలేదు. మిగిలిన సగభాగం ఆరోగ్యంగా ఉంది కదా అనే ఆశతోనే బతికాడు. ఆయన అనుభవాలు ఈ పుస్తకంలో ఎంతో ప్రేరణ కలిగిస్తాయి.
ద చేంజ్‍:

మనం చాలా క్యాజువల్‍గా అనేసే మాట.. ‘టైం లేదు’. జీవితంలో ప్రతీదీ ఎందుకింత సంక్లిష్టం? ప్రపంచాన్ని పాలిస్తున్నది ఎవరు?, ప్రజాస్వామ్యం మన ఆశల్ని తీరుస్తుందా? ఎవరిని ఎంత వరకు నమ్మాలి?.. వీటికి కచ్చితమైన సమాధానాలు దొరికినపుడే మనలో నిజమైన మార్పు మొదలవుతుంది. ఏ జబ్బుకు ఆ మందు అన్నట్టు ఏ సమస్యకు ఆ మోడల్‍ పరిష్కారాన్ని అందించారు ఈ పుస్తక రచయితలు మైకేల్‍ క్రోజెమ్స్, రోమన్‍. ఇందులో కష్టమైన సమస్యలకు 52 నమూనాల్లో సులువైన పరిష్కారాలను సూచించారు. ఇందులోని ప్రతి పేజీ విలువైనదే.
ద స్పై:

‘మాతాహరి’.. నెదర్లాండ్స్లో కనిపించే ఈమె విగ్రహం కట్టిపడేస్తుంది. ఎంతటివారైనా ఆమె అందానికి దాసోహం అనాల్సిందే. డచ్‍కు చెందిన ఈ డ్యాన్సర్‍ మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీకి గూఢచారిగా పనిచేసిందనే నెపంతో ఫ్రాన్స్ సైన్యం నిర్దాక్షిణ్యంగా కాల్చిపడేసింది. ఇప్పటికీ ఆమె గూఢచారిణి కాదని, నిర్దోషి అని వాదించే వారున్నారు. ఆమె జీవితంలో ఉత్కంఠ రేపే సన్నివేశాలతో పాల్‍ కొయిలొ రాసిన పుస్తకమిది. ‘పరుసవేది’ (అల్‍కెమిస్ట్) అనే పుస్తకం ద్వారా పాల్‍ కొయిలొ మన తెలుగు పాఠకులకు సుపరిచితమైన రచయిత.

రష్మిక నచ్చిన, మెచ్చిన
మరికొన్ని పుస్తకాలు
వెన్‍ బ్రీత్‍ కమ్‍ బికమ్స్ ఎయిర్‍
ద సీక్రెట్‍
ఇకిగాయ్‍
ట్యూజ్‍డేస్‍ విత్‍ మోరీ

Review పుస్తకాలతోనే ‘క్రష్‍’.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top