బెడ్‍పై స్టార్స్!

సెలబ్రిటీల యందు మంచు లక్ష్మి డిఫరెంట్‍. ఆమె ఏం చేసినా సమ్‍థింగ్‍ స్పెషల్‍గానే ఉంటుందని అంటారు. ఇప్పుడామె ఓ వినూత్నమైన షో చేయడానికి రెడీ అయ్యారు ‘ఊట్‍’ అనే యాప్‍ ద్వారా డిజిటల్‍ ప్లాట్‍ఫామ్‍లో ‘ఫీట్‍ అప్‍ విత్‍ ద స్టార్స్ తెలుగు’ షోతో ఆడియన్స్ ముందుకు రానున్నారు. సెప్టెంబరు 23 నుంచి ‘కలర్స్ తెలుగు’ అనే బ్రాండ్‍ పేరుతో ఈ షో విడుదల అవుతుంది. బాలీవుడ్‍, హాలీవుడ్‍లలో ఇటువంటి షోస్‍ మామూలే. కానీ తెలుగులో మాత్రం ఇది కొత్త ప్రయత్నమే. ఈ షోలో బెడ్‍ మీద సెలబ్రిటీలను మంచు లక్ష్మి ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఈ షూటింగ్‍ బెడ్‍ సెట్‍ లక్ష్మి ఇంట్లోనే వేశారు. ప్రముఖ నటీనటులంతా మోహన్‍బాబు ఇంటికి ఏదో సందర్బంలో వచ్చిన వారే. వాళ్లంతా అదే ఇంట్లోని బెడ్‍ సెట్‍పై ఆయన కుమార్తెతో పిచ్చాపాటీ మాట్లాడనున్నారు. సమంత తదితర ప్రముఖులు ఈ షోలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు తాను చేసిన అందరిలో వరుణ్‍తేజ్‍ ఎపిసోడ్‍ బాగా వచ్చిందని లక్ష్మి అంటున్నారు. ఇంకా నానీ, తదితరులు తెలుగు సినీ ప్రముఖులు ఈ షోలో తళుక్కు మననున్నారు

Review బెడ్‍పై స్టార్స్!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top