భర్త మహాశయులకు విజ్ఞప్తి

హీరో రవితేజ, దర్శకుడు కిశోర్‍ తిరుమల కలయికలో ఓ చిత్రం రూపొందుతోంది. సుధాకర్‍ చెరుకూరి నిర్మాత. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా స్పెయిన్‍లో కొత్త షెడ్యూల్‍ను ప్రారంభించుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ షెడ్యూల్‍లో భాగంగా కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్‍ ప్లాన్‍ చేస్తోంది. ఇప్పుడీ సినిమా టైటిల్‍కు సంబంధించి ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. ఇన్నాళ్లూ ‘అనార్కలి’ అనే టైటిల్‍ పరిశీలనలో ఉండగా, తాజాగా, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పేరు కొత్తగా వినిపిస్తోంది. ఈ టైటిల్‍కే చిత్ర బృందం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.

Review భర్త మహాశయులకు విజ్ఞప్తి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top