ఏం చేస్తున్నామో
అదే నిజమైన ప్రపంచం!
కాస్త సమయం దొరికితేనే కాదు.. పనులు మానుకుని మరీ నేటి తరం సోషల్ మీడియాలో తలమునకలైపోతోంది. మొబైల్‍పై రీల్స్, షార్టస్, వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులను అదేపనిగా స్క్రోల్ చేయడం ఓ వ్యసనంగా మారిపోయింది. ఇది వారూ వీరూ అని కాదు.. అందరికీ అదేపనిగా మారిపోయింది. ఈ ‘సోషల్’ వ్యసనంపై కథానాయిక శ్రుతిహాసన్ కొన్ని మంచి విషయాలు చెప్పింది. నేటి తరం అందరూ వినాల్సిన మాటలివి..
‘సామాజిక మాధ్యమాలకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో కొన్నాళ్లు దూరం కావాలి. అది చాలా మేలు చేస్తుంది. మన వాస్తవ ప్రపంచం ఏమిటో అర్థమవుతుంది. అభిమానులతో కనెక్ట్ కావడానికి సోషల్ మీడియా ఓ గొప్ప మాధ్యమం. అయితే, ఆ ప్రపంచంలోకి వెళ్లాక తెలియకుండానే గంటల పాటు అందులో గడిపేస్తుంటాం. నా సమయం ఏమవుతుందో, ఎక్కడికి పోయిందో కూడా అర్థమయ్యేది కాదు కొన్నిసార్లు. అందుకే ఇన్‍స్టాకు కొన్నాళ్లు దూరంగా గడిపా. డిజిటల్ డిటాక్స్ అనేది ప్రతి ఒక్కరికీ అవసరం. దానికి పూర్తిగా కొంతకాలం దూరంగా ఉండాలి. సామాజిక మాధ్యమాల్లో నేడు మనం చూస్తున్న ప్రపంచం నిజమైన ప్రపంచం కాదు. మన వ్యక్తిగత జీవితంలో ఏం చేస్తున్నామన్నదే మన నిజమైన ప్రపంచం. అది అందరం అర్థం చేసుకోవాలి. నేను నా కుటుంబం, స్నేహితులకు కచ్చితంగా సమయాన్ని కేటాయిస్తాను’.










































































































































































































































Review మనం చూస్తున్నది కాదు...