
ఇది చదివి సినిమా టైటిల్ అనుకోకండి. మంచు మోహన్‍బాబు కుటుంబంలో ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణుకు ఇటీవలే కొడుకు పుట్టాడు. కొత్త ఏడాది ప్రారంభంలో ఇంట్లోకి ఓ కొత్త సభ్యుడు రావడంతో మంచు కుటుంబం ఆనందానికి అవధుల్లేవు. విష్ణు, వెరోనికా దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు (కవలలు) సంతానం. మూడో సంతానంగా అబ్బాయి పుట్టాడు. ‘అవ్రామ్ భక్త’ అనే పేరు పెట్టారు. ‘అవ్రామ్’ అంటే ఎవరూ ఆపలేని వాడు అని అర్థమట. ఇక, ‘భక్త’ అంటే.. మోహన్‍బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు. అందులోని ‘భక్త’ను అవ్రామ్ సరసన చేర్చారు. తన కొడుకు పేరు ముచ్చటను తండ్రి విష్ణు ట్విట్టర్‍లో అభిమానులతో పంచుకున్నారు. ఇదీ ‘మనవడొచ్చాడు’ కథ.
Review మనవడొచ్చాడు!.