పాకిస్థాన్‍లో భరతనాట్య ప్రదర్శన చేసిన భారతీయ నృత్య కారిణి యామిని కృష్ణమూర్తి. నృత్యంతో భారతీయ సంస్క•తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ఆమె జీవితంలో చాలా డ్రామా ఉంది. అవన్నీ తెరపై ఆవిష్కరించనున్నారు గిరిధర్ గోపాల్. ఆయనే ఈ సినిమాకు దర్శక నిర్మాత. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన యామిని కృష్ణమూర్తి ఇరవై ఎనిమిదో ఏటనే పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్ కూడా అందుకున్నారు. తెలుగు వారైన యామినీ కృష్ణమూర్తి భరతనాట్యం, కూచిపూడి నృత్యాలతో ముప్పయి దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. •ప్లెట్‍పై నృత్యం చేయడం, కలశం తలపై పెట్టుకుని నర్తించడం వంటి పలు రూపకాల్ని పరిచయం చేసింది ఆమెనే. ప్యారిస్‍లో మూడు గంటల పాటు, ఐదు వేల మంది ప్రేక్షకుల మధ్య నృత్య ప్రదర్శన చేశారు. ఇక ఆమె బయోపిక్‍గా రూపొందనున్న ‘యామిని’లో హిందీ, తమిళ భాషలకు చెందిన అగ్ర నటులు నటిస్తారని తెలిసింది. వీరంతా ఇందులో కీలకపాత్రలు పోషిస్తారని గిరిధర్ గోపాల్ చెబుతున్నారు. ఈ చిత్రానికి యామినీ కృష్ణమూర్తి నృత్యాలు సమకూరుస్తారు. యాభై ఏళ్ల నృత్య జీవితంలో ఆమె సినిమాకు నృత్యాలు సమకూర్చనుండటం ఇదే తొలిసారి. అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్న చిత్రమిది. 1960, 70ల నేపథ్యంలో సాగే చిత్రం కాబట్టి ఇందులో ఇందిరాగాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణ, ఎలిజబెత్ రాణి, కెనడియన్ ప్రైమ్ మినిస్టర్, మెక్సికల్ ప్రెసిడెంట్.. ఇలా పలు పాత్రలు కనిపిస్తాయి. తెలుగు, తమిళం, ఆంగ్ల భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్న గిరిధర్ గోపాల్ విషయానికి వస్తే.. ఆయన చిత్రసీమలో ముప్పయి సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. 1990లో కెమెరా అసిస్టెంట్‍గా ఈయన ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత పబ్లిసిటీ రంగంలో కొంత కాలం పనిచేశారు. సినిమాపై మక్కువతో ఇటీవలే ‘దివ్యమణి’ అనే సినిమా చేశారు. తదుపరి ప్రయత్నంగా యామినీ కృష్ణమూర్తి బయోపిక్‍ను తెరకెక్కించబోతున్నారు.
మన సంస్క•తిని చాటే ‘యామిని’

Review మన సంస్క•తిని చాటే ‘యామిని’.