‘అత్తారింటికి దారేది’ చిత్రంలో పవన్‍కల్యాణ్ పాడిన ‘కాటమరాయుడా.. కదిరి నరసింహుడా..’ అనే పాట ఎంత హిట్టో అందరికీ తెలిసిందే. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే పవన్ హీరోగా రూపుదిద్దుకుంటున్న చిత్రంలోనూ పవన్ చేత పాట పాడించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఇందు కోసం కొన్ని ట్యూన్స్ను కూడా సంగీత దర్శకుడు అనిరుధ్ రెడీ చేశారట. అయితే, పవన్‍కల్యాణ్ ఇంకా చిత్ర యూనిట్ ప్రపోజల్‍ను ఫైనల్ చేయలేదని టాక్. త్రివిక్రమ్ మాత్రం ఏమైనా సరే పవన్ చేత పాడించాలని అనుకొంటున్నారట. మరి పవన్‍కల్యాణ్ మళ్లీ సింగర్‍గా తన టాలెంట్ చూపుతాడా? లేదా? అనేది వేచి చూడాల్సిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ తాజా చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు పవన్ సరసన నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి టైటిల్ ఫైనలైజ్ కాలేదు.
మళ్లీ పాడతాడా?

Review మళ్లీ పాడతాడా?.