
ఇటీవలే ‘దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక’ అంటూ అదరగొట్టిన అల్లు అర్జున్‌పై మరికొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించడానికి చిత్ర బృందం సిద్ధమైంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ షూటింగ్ ప్రస్తుతం ఏపీలోని మారేడుమిల్లిలో జరుగుతోంది. గతంలోపూ ఒక ముఖ్య షెడ్యూల్‌ను ఇక్కడ చిత్రీకరించారు. ప్రస్తుత పార్ట్ ముగిశాక హైదరాబాద్‌లో జరిగే మరో షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్తవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ‘పుష్ప’ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఇటీవలే విడుదల చేసిన ‘దాక్కో మేక’ పాట ఇప్పటికే 50 మిలియన్ వ్యూస్ దాటిపోయింది. క్రిస్మస్కు ఈ చిత్రం విడుదల కానుంది.
పిల్లను చూసి పెట్టండి
Review మారేడుమిల్లిలో మళ్లీ ‘పులి’.