హీరో రామ్‍చరణ్ నిర్మాతగా కూడా బిజీ అయిపోతున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‍పై తండ్రి చిరంజీవి హీరోగా ‘ఖైదీ నంబర్ 150’ తీసి హిట్ కొట్టిన రామ్‍చరణ్, తాజాగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ని సురేందర్‍రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించే పనుల్లో తలమునకలై ఉన్నాడు. ఈ సినిమాలో కూడా చిరంజీవే హీరో. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇక, మూడవ సినిమాను తానే హీరోగా కొరటాల దర్శకత్వంలో నిర్మించడానికి సన్నాహాలు చేసుకొంటు న్నాడు. అటు హీరోగా, ఇటు నిర్మాతగా రాణిస్తున్న రామ్‍చరణ్.. ఇప్పటికే కొరటాల శివతో సినిమా చేయాల్సి ఉంది. అయితే కథ వర్కవుట్ కాకపోవడంతో దాన్ని ఆపేశారు. ప్రస్తుతం రామ్‍చరణ్ సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ చేస్తున్నారు. 20 ఏళ్ల క్రితం నాటి వాతావరణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో రామ్‍చరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా కనిపిస్తారని టాక్.
ముచ్చటగా మూడు!

Review ముచ్చటగా మూడు!.