మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ క్రమంగా తెలుగు సినిమాల్లో బిజీ అవుతోంది. ‘అ ఆ’, ‘ప్రేమమ్’ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి, ‘శతమానం భవతి’తో కథానాయికగానూ ఆకట్టుకున్న ఈ భామ.. తాజాగా రామ్ సరసన ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలో నటిస్తోంది. ఆ తరువాత నాని సరసన నటించడానికి కూడా అంగీకరించినట్టు సమాచారం. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కృష్ణార్జున యుద్ధం’ పేరుతో నాని హీరోగా ఓ సినిమా ఇప్పటికే ఖరారైంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌ను కథానాయికగా తీసుకున్నట్టు టాక్. ఇందులో ఆమె పూర్తిగా ఆధునిక యువతి పాత్రలో కనిపించనున్నారట. మలయాళ చిత్రసీమకు చెందిన ఆసిన్, మీరా జాస్మిన్, నిత్యామీనన్, నయనతార ఇప్పటికే తెలుగు స్టార్ హీరోయిన్లుగా వెలుగుతున్నారు. అందం, అభినయం పుష్కలంగా ఉన్న అనుపమ కూడా వారి సరసన చేరతారని టాలీవుడ్లో అందరూ అంటున్నారు.
మోడ్రన్ ‘అనుపమ’

Review మోడ్రన్ ‘అనుపమ’.