రవితేజ చాలా కాలం గ్యాప్ తరువాత మళ్లీ జోరు మీద ఉన్నాడు. ఇటీవలే ‘రాజా ది గ్రేట్’తో తెరకెక్కిన ఈ మాస్ మహారాజ్ ప్రస్తుతం ‘టచ్ చేసి చూడు’ చిత్రంలో షూటింగ్లో నిమగ్నమై ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇది చేస్తూనే కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఓ చిత్రం చేయ బోతున్నాడు. దీనికి ‘నేల టికెట్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగు తోంది. మాళవిక శర్మను కథానాయికగా ఎంచుకున్నారు. రామ్ తాళ్లూరి ఈ చిత్ర నిర్మాత. రవితేజ శైలి మాస్ మసాలా అంశా లతో పాటు కల్యాణ్‌కృష్ణ శైలి కుటుంబ నేపథ్యం మేళవింపుతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా, రవితేజ ఓ ప్రముఖ దర్శకుడితో మరో చిత్రం గురించి కూడా చర్చలు జరుపుతున్నాడు. చూస్తుంటే చాలా కాలం గ్యాప్ తరువాత రవితేజ కెరీర్ మళ్లీ గాడిలో పడినట్టు కనిపిస్తోంది కదూ!
















































































































































































































































Review రవితేజ ‘నేల టికెట్….