‘రామాయణం’ ఖాయం?

‘బాహుబలి’ తరువాత తెలుగు సినిమా రేంజ్‍ బాగా పెరిగిపోయింది. ఎంత బడ్జెట్‍కైనా సరే… నిర్మాతలు సై అంటున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‍ రూ. 500
కోట్లు బడ్జెట్‍తో ఓ భారీ సినిమా నిర్మించనున్నారనే ప్రచారం కొన్నాళ్లుగా సాగుతోంది. మధు మంతెన, నమిత్‍ మల్హోత్రాలతో కలిసి ఆయన ఈ ప్రాజెక్టును పట్టాలు ఎక్కించడానికి ప్లాన్‍ చేస్తున్నట్టు టాలీవుడ్‍ టాక్‍. అన్ని హంగులతో, తెలుగు, తమిళం, హిందీలో త్రీడీ ఎఫెక్టస్తో ఈ సినిమాను తెరకెక్కించడానికి భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. దీనికి తగ్గట్టే… ఇటీవలే అల్లు అరవింద్‍ తన గీతా ఆర్టస్ బ్యానర్‍పై ‘సంపూర్ణ రామాయణం’ అనే టైటిల్‍ను నమోదు చేయించడం ఈ ఊహాగానాలకు మరింతగా రెక్కలు వచ్చాయి. ఇక, ఆయన నిర్మించే భారీ బడ్జెట్‍ చిత్రం ఇదేనని టాలీవుడ్‍ జనం, అభిమానులు ఫిక్స్ అయిపోయారు. చూడాలి… ఈ సినిమా తెలుగు సినిమా రేంజ్‍ను ఏ స్థాయికి తీసుకెళ్తుందో…!

Review ‘రామాయణం’ ఖాయం?.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top