
అదేంటి? మెగా హీరో రామ్‌చరణ్ రంగస్థలంలోనూ నటిస్తున్నారా అనే సందేహం వచ్చిందా? అదేం లేదు కానీ, సుకుమార్ దర్శకత్వంలో మైత్రిమూవీస్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న రామ్‌చరణ్ సినిమాకు ‘రంగస్థలం’ అనే టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారు. ఈ మధ్యకాలంలో ఇదో డిఫరెంట్ టైటిల్. అసలే వినూత్నంగా సినిమాలను తీసే సుకుమార్ ఈ టైటిల్ పెట్టడంపై సర్వత్రా డిస్కషన్స్ నడుస్తున్నాయి. అన్నట్లు ఈ టైటిల్ కింద ట్యాగ్‌లైన్‌గా ‘1985’ అని కూడా పెట్టారు. ఇది అంతటా ఆసక్తి రేపుతోంది. 1985 నాటి పల్లెటూరి కథతో ఈ చిత్రం తెరకెక్కుతోందని టాక్. ఇందుకు తగ్గట్టే రామ్‌చరణ్ గుబురు గడ్డంతో ఈ సినిమాలో కనిపించనున్నాడు. పైగా బధిరుని పాత్రలో నటించనున్నాడని అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా గురించి అంతా సస్పెన్స్ నడుస్తోంది. రిలీజయ్యాకనే విషయం ఏమిటో చూడాలి.
Review రామ్‌చరణ్ ‘రంగస్థలం.