సంగీత.. ఈ పేరు కానీ, ఈ పేరుతో ఉన్న నటి గురించి కానీ ఈ తరానికి పెద్దగా ఏమీ తెలియకపోవచ్చు. ఇక, పాత తరం వారు కూడా దాదాపు ఈ పేరును, ఈ నటిని మరిచిపోయి ఉండవచ్చు. ‘ముత్యాలముగ్గు’లో సంగీతగా అలరించిన నటి తాజాగా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. తమిళ, మలయాళ సినిమాల్లో ఎక్కువగా నటించిన ఆమె ఇప్పుడిప్పుడే తెలుగు సినీ పరిశ్రమపై దృష్టి సారించారు. నటిగా తనకు మంచి గుర్తింపునిచ్చిన తెలుగులో మళ్లీ నటించాలనే ఉద్దేశంతో చెన్నై నుంచి హైదరాబాద్‍కు వచ్చేసినట్టు ఇటీవల ఆమె వెల్లడించారు. అమ్మ పాత్రలతో పాటు తన వయసుకు తగిన అన్ని పాత్రల్లోనూ నటించాలని ఉందని ఆమె తన మనోగతాన్ని వినిపించారు. అలాగే రాజకీయాల్లోనూ ప్రవేశించాలని తనకు ఆసక్తి ఉందని, తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరే ఉద్దేశం ఉందని ఆమె వెల్లడించారు. అన్నట్టు- సంగీత స్వస్థలం వరంగల్ జిల్లా. ముత్యాలముగ్గు సినిమా ద్వారా మంచి నటిగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. సంగీత నటించిన తొలి తెలుగు సినిమా ‘తీర్పు’. హీరోయిన్‍గా ఆమె తెలుగులో వంద సినిమాల్లో నటించారు. హీరోయిన్‍గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 600కు పైగా సినిమాల్లో నటించారు. భవిష్యత్తులో నిర్మాతగానూ మారాలని ఆమె భావిస్తున్నారు.
రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగీత

Review రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగీత.