జయాప•యాలతో సంబంధం లేకుండా వరుసగా చిన్నా పెద్దా సినిమాలు చేసుకుపోవడం రాంగోపాల్‍వర్మ శైలి. ఇటీవలే నాగార్జునను ‘ఆఫీసర్’గా చూపించిన ఈయన తాజాగా ‘వైరస్’ పేరుతో సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముంబై నేపథ్య కథలో ఈ చిత్రం రూపొందనుందట. ముంబైకి చెందిన ఓ విద్యార్థి మధ్య ఆఫ్రికాకు వెళ్లి ఓ వైరస్ బారిన పడతాడు. తిరిగి ముంబైకి రావడంతో అతని నుంచి ఆ వైరస్ ఇతరులకూ వ్యాపించి మొత్తం ముంబై నగరానికి ముప్పుగా మారుతుంది. దాంతో ప్రభుత్వం ఆ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఒకరికొకరు 20 అడుగుల దూరంలో ఉండాలనే నిబంధన పెడుతుంది. కానీ, 2 కోట్ల జనాభా ఉన్న ముంబైలో ఈ నిబంధన అమలు కావడం సాధ్యమేనా? అనేది కథాంశం. వర్మ స్టైల్‍లో ఈ చిత్రం ఎలా తెరకెక్కుతుందో వేచి చూడాల్సిందే.
వర్మ దారి వర్మదే

Review వర్మ దారి వర్మదే.