
ఎవరైనా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని అనుకుంటారు. మన పెద్దలు చెప్పింది కూడా అదే. కానీ, దీనికి ‘వాల్మీకి’ కొత్త భాష్యం చెబుతున్నాడు. ‘అందుకే పెద్దోళ్లు చెప్పిండ్రు. నాలుగు బుల్లెట్లు సంపాయిస్తే రెండు కాల్చు కోవాలె.. రెండు దాచుకోవాలె..’ అంటూ ‘వాల్మీకి’గా రాబోతున్న వరుణ్‌తేజ్ అంటున్నాడు. ఈ మాస్ డైలాగ్‌తో కూడిన టీజర్ ఇటీవలే విడుదలైంది. అభిమానులను ఇందులోని ఈ డైలాగ్ విశేషంగా ఆకట్టుకుంటోందని చిత్ర బృందం చెబుతోంది. ‘నా సినిమాలో విలనే నా హీరో’ అంటూ చెప్పే డైలాగ్‌తో ఈ టీజర్ మొదలవుతుంది. ఇందులోని వరుణ్‌తేజ్ ఎక్స్ ప్రెషన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. పూజా హెగ్డే, మృణాళిని రవి ఈ సినిమాలో హీరో యిన్లుగా చేస్తున్నారు. తమిళ హిట్ చిత్రం ’జిగర్తండా’కు మన ‘వాల్మీకి’ రీమేక్. సెప్టెంబరు 13న ఈ సినిమా విడుదల కాబోతోంది
Review వాల్మీకి.