విరాట్‍కు ప్రభాస్ గిఫ్ట్..‘బాహుబలి’ తరువాత ప్రభాస్‍కు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ పెరిగారు. ఈ జాబితాలో ప్రముఖ నటుల వారసులూ ఉండటం విశేషం. ఇటీవల విరాట్ అనే చిన్నారికి ‘బాహుబలి’లో తాను వాడిన కత్తిని పోలిన కత్తిని తయారు చేయించి బహుమతిగా ఇచ్చాడు ప్రభాస్. దీంతో విరాట్ ఎవరనే ఆసక్తి అందరిలోనూ కలిగింది. ఆరా తీస్తే.. ప్రముఖ తమిళ నటుడు శివాజీ గణేశన్ ముని మనవడని తేలింది. అంటే, శివాజీ గణేశన్ కుమారుడు ప్రభు కొడుకు విక్రమ్ ప్రభు కుమారుడు ఈ విరాట్. ‘బాహుబలి’ సినిమా చూసిన దగ్గరి నుంచి ఈ బుడతడు ప్రభాస్‍కు ఫ్యాన్ అయిపోయాడట. ఈ విషయాన్ని విక్రమ్ ప్రభు ద్వారా తెలుసుకున్న ప్రభాస్.. తన చిన్నారి ఫ్యాన్‍ను సర్‍ప్రైజ్ చేయాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవు బాహుబలిలో తాను వాడిన ఖడ్గాన్ని పోలిన కత్తిని తయారు చేయించి ‘ఫర్ విరాట్.. విత్ లవ్ ప్రభాస్ అని రాసి పంపించాడు. ఈ విషయాన్ని విక్రమ్ ప్రభు తన ఇన్‍స్టాగ్రామ్‍లో అభిమానులతో పంచుకుని ఫొటో షేర్ చేశాడు.
విరాట్‍కు ప్రభాస్ గిఫ్ట్…

Review విరాట్‍కు ప్రభాస్ గిఫ్ట్….