నాగచైతన్య శైలజారెడ్డి ఇంటి అల్లుడయ్యాడు. శైలజారెడ్డి ఎవరు? అనేది మీ సందేహం కదూ! ఆశ్చర్యపోకండి. అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా టైటిల్ ఇది. ఇటీవలే ఓ ఇంటివాడైన నాగచైతన్య అసలే చెన్నైలోని అత్తారింటికి.. ఇటు హైదరాబాద్‍కు తీరిక లేకుండా తిరుగుతున్నాడు. ఈ హడావుడిలోనే ‘శైలజారెడ్డి అల్లుడు’గా సందడి చేయనున్నాడు. టైటిల్‍తోనే సగం అంచనాలు క్రియేట్ అయ్యాయని పరిశ్రమ వర్గాలు అంటు న్నాయి. వరుస హిట్ సినిమాల దర్శకుడు మారుతి ఈ సినిమాకు దర్శకుడు కావడం మరింత అంచనాలను పెంచుతోందీ సినిమా. అత్తగా రమ్యకృష్ణ నటిస్తారని సమాచారం. తమన్ సంగీత దర్శకుడిగా ఎంపి కయ్యాడు. సమంతను పెళ్లాడిన నాగచైతన్య.. అటు తరువాత ఒప్పు కున్న మొట్టమొదటి సినిమా ఇదే కావడం విశేషం. రియల్‍లైఫ్‍లో అల్లుడైన నాగ్ రీల్ లైఫ్‍లో అల్లుడిగా ఎలా మెప్పిస్తాడో తెరపై చూడాల్సిందే.
శైలజారెడ్డి అల్లుడు

Review శైలజారెడ్డి అల్లుడు.