రాజా ది గ్రేట్’ తరువాత రవితేజ మంచి ఊపుమీద ఉన్నాడు. చాలా కాలం తరువాత తెరపై కనిపించిన ఈ మాస్ మహారాజ్ తదుపరి చిత్రాలకు సిద్ధమవుతున్నాడు. సంక్రాంతి బరిలో ఉన్నానని కూడా చెబుతున్నాడు. సంక్రాంతికి వచ్చే సినిమాలంటే అందరికీ ఆసక్తే. ఇప్పటికే పవన్‍కల్యాన్ ‘అజ్ఞాతవాసి’ జనవరి 10న విడుదల కానుంది. బాలకృష్ణ ‘జైసింహా’ కూడా సంక్రాంతికే రాబోతోంది. ఇక, తమిళ హీరో సూర్య అనువాద చిత్రం ‘గ్యాంగ్’ కూడా పండుగ బరిలో నిలు స్తోంది. రాజ్‍తరుణ్ కొత్త సినిమా ‘రాజు గాడు’ కూడా ఈ సీజన్‍లోనే ఉందని ఫిల్మ్నగర్ టాక్. ఇప్పుడు వీటన్నిటికీ పోటీకి మరో చిత్రం సిద్ధమవుతోంది. రవితేజ తాజా చిత్రం ‘టచ్ చేసి చూడు’. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా షూటింగ్ పూర్త య్యింది. జనవరి 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఈ సంక్రాంతి తెలుగు సినీ ప్రేక్షకులకు కనువిందే.
సంక్రాంతి పందెంకోళ్లు.. ఈ సినిమాలు

Review సంక్రాంతి పందెంకోళ్లు.. ఈ సినిమాలు.