
విజయం.. అది చిన్నది కానీ, పెద్దది కానీ పండుగలా జరుపుకోవాలని అంటోంది కథానాయక సమంత. పరీక్షల్లో వందకు తొంభై మార్కులు వచ్చిన వాళ్లకు ఇంకా కష్టపడి చదవాల్సింది అని చెబుతాం. కానీ, ఎంత కష్టపడితే ఆ మార్కులైనా వచ్చాయో ఆలోచించం. కాబట్టి ఎవరైనా విజయం సాధిస్తే మనస్ఫూర్తిగా అభినందనలు తెలపాలని, అంతేతప్ప, ఇంకా సాధించాల్సిందని అనకూడదని అంటోంది. విషయం ఏదైనా కానీ, ఆమె చెప్పిన దాంట్లో ‘సబ్జెక్ట్’ ఉంది. కాబట్టి సమంత మాటలతో మనమూ ఏకీభవించాల్సిందే..!
Review సక్సెస్ పండుగ.