సీన్ రివర్స్

తెలుగు సినిమాకు నిన్నా మొన్నటి వరకు కథలు కరువయ్యాయని చెప్పుకునే వారు. అరువు తెచ్చుకున్న కథలు.. ఎరువు పాత్రలతో నెట్టుకొచ్చిన తెలుగు వెండితెర ఇప్పుడు ఇరుగుపొరుగుకు తానే కథలను అందించే స్థాయికి ఎదుగుతోంది. వరుసగా పలు చిత్రాలు ఇప్పుడు బాలీవుడ్‍తో పాటు ఇతర భాషల్లోనూ తెరకెక్కనున్నాయి. కొన్ని ఉదాహరణలు..
– పూరీ జగన్నాథ్‍ దర్శకత్వంలో ఎన్టీఆర్‍ కథానాయకుడుగా వచ్చిన టెంపర్‍ బాలీవుడ్‍లో రణవీర్‍సింగ్‍ కథానాయకుడిగా హంగులద్దుకుంటోంది. రోహిత్‍శెట్టి ఈ సినిమాకు దర్శకుడు.
– నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా.. కన్నడ హీరో ఉపేంద్ర తన భాషలో రీమేక్‍ చేస్తున్నారు.
– ఆ మధ్య నందమూరి కల్యాణ్‍రామ్‍ నటించిన పటాస్‍ చిత్రాన్ని కన్నడంలో లారెన్స్ హీరోగా ఇప్పటికే తెరకెక్కించి విడుదల చేశారు.
– నిఖిల్‍ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’.. అర్జున్‍కపూర్‍, శ్రద్ధాకపూర్‍ జంటగా హిందీలో రీమేక్‍ అవుతోంది.
– కట్టా శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ప్రస్థానం.. హిందీలో సంజయ్‍దత్‍తో రీమేక్‍ చేస్తున్నారు.
మన తెలుగు కథలకు ఇరుగుపొరుగు చిత్రసీమల్లో మంచి డిమాండ్‍ ఉందనేందుకు ఇవే నిదర్శనాలు

Review సీన్ రివర్స్.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top