రామ్‍చరణ్ పక్కా పల్లెటూరు చిత్రంలో నటిస్తున్నాడు. మైత్రి మూవీస్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్‍చరణ్ పాత్ర చాలా విలక్షణంగా ఉంటుందని చిత్ర పరిశ్రమ టాక్. పూర్తిగా గడ్డంతో, పల్లెటూరి వాసిగా కనిపించే రామ్‍చరణ్ బధిరుడి పాత్రలో నటిస్తున్నారనే మాట కూడా వినిపిస్తోంది. సరిగ్గా ఇప్పటికి ఇరవై ఏళ్ల క్రితం పల్లెటూరు ఎలా
ఉండేదో.. అటువంటి వాతావరణం ఉన్న పల్లెటూరు కోసం చిత్ర బృందం అన్వేషణ సాగిస్తోంది.ఎట్టకేలకు రాజమండ్రి సమీపంలోని ఓ ఊరిని ఎంపిక చేసి.. అక్కడే ఇటీవలి వరకు షూటింగ్ జరిపారు. రామ్‍చరణ్ సరసన సమంత నటిస్తున్న ఈ చిత్రం కోసం ‘రేపల్లె’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఇది వాస్తవం కాదని, ఇంకా డిఫరెంట్ టైటిల్ ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
20 ఏళ్ళ క్రితం నాటి ఊరు

Review 20 ఏళ్ళ క్రితం నాటి ఊరు.