వానొచ్చినా.. చలిపెట్టినా.. జలుబు చేసినా.. జ్వరం వచ్చినా.. నోరు బాగోకున్నా.. పొట్ట మందంగా ఉన్నా.. వేడి వేడి సూప్ తాగుతుంటారు కొందరు. హోటల్‌కు వెళ్తే డిన్నర్ లేదా లంచ్‌కు ముందు కచ్చితంగా సూప్ తాగేవాళ్లు మరికొందరు.. ఒకప్పుడు సంపన్న వర్గాల్లో మాత్రమే ఉండే సూప్ తాగడం అనే ఈ అలవాటు నేడు ఆధునిక జీవనశైలి పుణ్యమా అని అందరికీ ఒంటబట్టింది. ఫలితంగా ‘సూప్’ చాలా ఫేమస్ అయిపోయింది. అసలీ సూప్ ఏమిటి? ఎందుకు తాగాలి? తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనం ఏమిటి? ఆరోగ్యానికి ఎలా, ఎందుకు మంచిది? అనేది తెలుసుకునే ముందు.. ‘సూప్ అంటే గంజి నీళ్లలాంటివే కదా.. ఎలా తాగాలి?’ అని నొసలు చిట్లించకండి సుమా? ఎందుకు తాగాలో తెలుసుకోండి మరి..
మన అమ్మమ్మల కాలం నాటి గంజి నీళ్లే నేటి సూప్ నీళ్లు. ఒకప్పుడు తినడానికి ఏమీ లేని పేదవాళ్లు కాసిని నూకల్లో
నీళ్లు పోసి గంజిలా కాచుకుని తాగి కడుపు నింపుకునే వారు. సరిగ్గా ఈ కారణంతోనే అది కాస్తా మళ్లీ సూపు రూపంలో టేబుల్ మీదికొచ్చింది. లంచ్ లేదా డిన్నర్‌కు ముందు కాస్త సూప్ తాగడం వల్ల పొట్ట కొంత మేరకు నిండుతుంది. దాంతో తరువాత మితంగా ఆహారం తీసుకుంటాం. అంటే- సూప్ అనేది పేదవాడి ఆకలి తీరుస్తుంది. మరీ ఎక్కువగా తినకుండా చేసి సంపన్నుల ఆరోగ్యాన్నీ కాపాడుతుంది. కాబట్టి ఎవరు ఏ కారణంతో తీసుకున్నా సూప్ మంచిదే.
పాతకాలం నాటిదే..
ఒకప్పుడు జలుబు చేసినా, జ్వరం వచ్చి నోరు చేదుగా అనిపించినా, అరగనట్టు అనిపించినా అమ్మమ్మలు మిరియాలు దట్టించిన రసం తాగమనేవారు. ఒకరకంగా అదీ సూపే. అటు చేదు నోటికి రుచిగానూ ఉంటుంది. ఇటు ఆ మిరియాల ఘాటు పొట్టనీ బాగు చేస్తుంది. అలాగే కందిపప్పు, టొమాటో, మునక్కాడ, ధనియాల పొడి… ఇలా అన్నీ కలిపి చేసే రసం కూడా సూపు లాంటిదే. ప్రాంతాన్ని బట్టి దీన్నే రకరకాలుగా మన అమ్మమ్మల కాలం నాటి గంజి నీళ్లే నేటి సూప్ నీళ్లు. ఒకప్పుడు తినడానికి ఏమీ లేని పేదవాళ్లు కాసిని నూకల్లో
నీళ్లు పోసి గంజిలా కాచుకుని తాగి కడుపు నింపుకునే వారు. సరిగ్గా ఈ కారణంతోనే అది కాస్తా మళ్లీ సూపు రూపంలో టేబుల్ మీదికొచ్చింది. లంచ్ లేదా డిన్నర్‌కు ముందు కాస్త సూప్ తాగడం వల్ల పొట్ట కొంత మేరకు నిండుతుంది. దాంతో తరువాత మితంగా ఆహారం తీసుకుంటాం. అంటే- సూప్ అనేది పేదవాడి ఆకలి తీరుస్తుంది. మరీ ఎక్కువగా తినకుండా చేసి సంపన్నుల ఆరోగ్యాన్నీ కాపాడుతుంది. కాబట్టి ఎవరు ఏ కారణంతో తీసుకున్నా సూప్ మంచిదే.
పాతకాలం నాటిదే..
ఒకప్పుడు జలుబు చేసినా, జ్వరం వచ్చి నోరు చేదుగా అనిపించినా, అరగనట్టు అనిపించినా అమ్మమ్మలు మిరియాలు దట్టించిన రసం తాగమనేవారు. ఒకరకంగా అదీ సూపే. అటు చేదు నోటికి రుచిగానూ ఉంటుంది. ఇటు ఆ మిరియాల ఘాటు పొట్టనీ బాగు చేస్తుంది. అలాగే కందిపప్పు, టొమాటో, మునక్కాడ, ధనియాల పొడి… ఇలా అన్నీ కలిపి చేసే రసం కూడా సూపు లాంటిదే. ప్రాంతాన్ని బట్టి దీన్నే రకరకాలుగా చేస్తుంటారు.
చలికాలంలో గుమ్మడి, సొరకాయ, టొమాటో, మునగ వంటి కూరగాయలతో చేసే చారు తాగడం దక్షిణాది రాష్ట్రాల్లో వాడుకలో ఉంది. ఇందులో కొబ్బరిపాలు, పప్పులు, ఇతర కూరగాయల ముక్కలు, మిరియాలు, లవంగాలు, చెక్క వంటి మసాలా దినుసులనూ కలుపుతుంటారు. దానిమ్మ, మామిడి, పైనాపిల్, పుచ్చ వంటి పండ్ల ముక్కలు కూడా వేస్తుంటారు కొందరు.
మటన్ ముక్కలనూ, ఎముకలనూ కొత్తిమీర, పుదీనా వంటి ఔషధ మొక్కలనూ కలిపి బాగా మరిగించి తయారు చేసే మటన్ పాయా లేదా షోర్బా వాడకం మొఘల్స్ కాలం నుంచీ వాడుకలో ఉంది. ఎముక వ్యాధులూ, గాయాలూ, రక్తహీనత తదితరాలతో బాధపడే వాళ్లకి కొన్ని నెలల పాటు దీన్ని ఇస్తుంటారు. దీని తయారీ ప్రాంతాలను బట్టి మారుతుంటుంది.
కుంకుమ పువ్వు కలిపిన పెరుగులో మటన్‌ను ఉడికించి కొద్దిగా సుగంధ ద్రవ్యాలు జోడించి చేసిన పాయాను చలికాలపు రాత్రిళ్లు తాగుతారు కాశ్మీరీలు.
ఉలవలను ఉడికించిన నీళ్లలో చింతపండు వేసుకుని చిక్కగా కాచే ఉలవచారు కూడా ఓ రకం సూపే.
కొంకణి తీరంలో పచ్చిమామిడికాయ రసం, కర్ణాటక వాసులు చేసుకునే కోకమ్ రసం.. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ద్రవాహారాన్ని జీర్ణశక్తి కోసం తీసుకోవడం వాడుకలో ఉంది.
వీటిల్లో కొన్నింటిని నేరుగా తాగితే, మరికొన్నింటిని అన్నంలో కలుపుకుని తింటుంటారు. స్థూలంగా ఇవన్నీ సూపు కిందకే వస్తుంటాయి.
నేడు రెడీమేడ్‌గానూ అందుబాటులో..
అంటే సూప్ మనం ఇంతకుముందు ఎరగనిదీ, రుచి చూడనిదీ ఏమీకాదు. క్రీస్తుపూర్వం 20వ శతాబ్దం నుంచీ వాడుకలో ఉన్నదే. నేడు అది అనేక రుచులను సంతరించుకుని రెడీమేడ్ ప్యాకెట్లగానూ, హోటళ్లలోనూ దొరుకుతోంది. కూరగాయలు, చికెన్, మటన్ వంటి వాటిని ఉడికించి చేసే పారదర్శకమైనవీ, ఆలూ, చిలగడదుంప, పాలదుంప, బియ్యం, మొక్కజొన్న వంటి పిండి పదార్థాలను కలిపి చేసే చిక్కనివీ అని సూప్‌ను రెండు రకాలుగా విభజించవచ్చు. ఈ రెండూ కాక పాలూ మీగడ, వెన్న, గుడ్డు వేసి చేసే క్రీమీ సూప్స్ కూడా ఉన్నాయి.
అయితే ఇవన్నీ ఒకప్పుడు ఎవరికి వారు ఇంట్లోనే ఉడికించి చేసుకునే వారు. కానీ, ఇప్పుడు అన్ని రకాలూ మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిల్లో కూడా కొన్ని పూర్తిగా పొడి రూపంలో ఉండేవీ మరికొన్ని అచ్చంగా పొడి కాకుండా పాక్షిక ఘనాహారంగా ఉండేవీ ఉంటున్నాయి. ఈ రెండో రకంలో పప్పులూ, ధాన్యాలూ, ఎండుపండ్లూ, నట్సూ, కూరగాయల ముక్కలూ, చికెన్, మటన్ ముక్కలూ, నూడుల్సూ, పాస్తా.. ఇలా అన్ని రకాలూ ఎండబెట్టి ప్యాక్ చేస్తున్నారు. దాంతో ఆయా ప్యాకెట్లలోని ఆ పొడితో కూడి ఆహార పదార్థాలను నీళ్లలో వేసి కాసేపు ఉడికించి, ఆయా ముక్కల్ని తింటూ తాగడం వల్ల అన్నిరకాల పోషకాలూ లభిస్తాయి. నీటి శాతం తక్కువగా ఉండి మూడు వంతులకు పైగా ఘనాహారం ఉంటే దాన్ని ‘స్ట్యూ’ అంటారు. సూప్‌లో ద్రవ శాతమే ఎక్కువ. అందుకే ఈ సూప్స్ అండ్ స్ట్యూస్ను భోజనానికి బదులుగానూ తీసుకుంటారు కొందరు.
సూప్.. ఎందుకు తాగాలి?
సూప్‌లో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పోషకాలన్నీ ఒంటికి పట్టి చర్మం తాజాగా ఉంటుంది. భోజనానికి ముందు దీన్ని తీసుకోవడం వల్ల అందులోని సుగంధ ద్రవ్యాలు జీర్ణవ్యవస్థను మేల్కొలిపి, చక్కగా పనిచేసేలా చేస్తాయి.
• కూరగాయలు, మటన్, చికెన్, చిక్కుళ్లు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, చిరుధాన్యాలు, మొక్కజొన్న.. ఇలా భిన్న పదార్థాలను ఉండికించి సూప్ చేస్తుంటారు. అందులో వాడే వాటిని బట్టి వాటిల్లో అన్నిరకాల ఖనిజాలూ, విటమిన్లూ, ప్రొటీన్లు, పీచు పదార్థాలు లభ్యమవుతాయి. ఇవి జీర్ణశక్తిని పెంచి మలబద్ధకం లేకుండా చేస్తాయి. ముఖ్యంగా కూరగాయలను ఉడికించి తయారు చేసే సూపు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ రకం సూపు తాగగానే పొట్ట నిండుతుంది. పిండిపదార్థాలూ, స్వీట్లూ, స్నాక్స్ తియ్యని శీతల పానీయాల వంటివి తినడం తగ్గుతుంది. దాంతో బరువు తగ్గుతారు.
• భోజనానికి ముందు సూప్ తీసుకోవడం వల్ల 20 శాతం క్యాలరీలు తక్కువగా తీసుకుంటారని వివిధ పరిశోధనల్లో తేలింది. పైగా కూరగాయల సూప్‌లో ఉండేవన్నీ సంక్లిష్ట పిండి పదార్థాలు కావడంతో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దాంతో రక్తంలో చక్కెర నిల్వలు పెరగవు. మధుమేహంతో బాధపడే వారికి ఇదెంతో మేలు చేస్తుంది.
• బీన్స్, ఆలూ, చిలగడదుంప, చికెన్, నూడుల్స్, రైస్, లెగ్యూమ్స్, పాస్తా.. వంటి వాటిని సూప్ రూపంలో తీసుకున్నప్పుడు వాటిల్లో కొన్ని క్యాలరీలు ఉంటాయి. ఆ మేరకు లంచ్ లేదా డిన్నర్లో ఆహారం తగ్గించుకోవాలి.
• మటన్ ఎముకలతో చేసే పాయాలో కాల్షియంతో పాటు ఇతర ఖనిజాలూ, అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఎముక గాయాలైన వాళ్లకి దీన్ని క్రమం తప్పక ఇస్తే త్వరగా కోలుకుంటారు.
• సూపుల్లో ఉల్లి, లీక్స్, కొత్తిమీర వంటివి వాడటం వల్ల పొటాషియం ఎక్కువగా లభ్యమవడంతో పాటు అది శరీరంలో అధికంగా ఉన్న సోడియంను బయటకు పంపేందుకు తోడ్పడుతుంది.
• చలికాలంలో వేడివేడిగా సూప్ తీసుకోవడం వల్ల నోటికి రుచిగా ఉంటుంది. కాబట్టి సూప్‌ను లంచ్, డిన్నర్ అనే సందిగ్ధం లేకుండా ఏ కాలంలోనైనా తీసుకోవచ్చు. అయితే రెడీమేడ్ ప్యాక్స్ కొనేటపుడు కొన్నింటిలో సోడియం శాతం ఎక్కువగా ఉంటుంది. అది లేకుండా చూసుకోవాలి. పైగా వాటిల్లో బేస్ ప్రొడక్టస్ కోసం ఎక్కువగా ఆలు లేదా కార్న్ స్టార్చ్ కలుపు తుంటారు. వాటిల్లో ప్రొటీన్లకన్నా పిండి పదార్థాల శాతం ఎక్కువ. కాబట్టి అవకాశం ఉన్న వారు తాజా కూరగాయలతో ఇంట్లోనే సూప్ తయారు చేసుకోవడం మేలు.



























































































Review ఆరోగ్య భాగ్యం సూప్.. ఎందుకు తాగాలి?.