అందమంటే పైపై మెరుగులే కాదు.
అందానికి ఇదివరకటి అర్థం మారిపోయింది.
అందంగా ఉండటం అంటే నేడు ఆత్మవిశ్వాసంతో ఉండటం. ఆత్మవిశ్వాసంతో ఉన్న వారే అందమైన మంచి పనులు చేయగలరు. అందంగా ఉన్నామనే, అందంగా ఉండాలనే భావన ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే కాక, మనసును ఉత్తేజితం చేస్తుంది. అందులోనూ అమ్మాయిల్లో, మహిళల్లో అందం పట్ల మక్కువ మరీ ఎక్కువ. అటువంటి ఉత్తేజాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మగు వలకు అందించడానికి అందుబాటులోకి వచ్చేసింది స్వప్నా బ్యూటీపార్లర్.
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని దులుత్ జీఏలో హెట్వి ఠక్కర్ ఆధ్వర్యంలో స్వప్నా బ్యూటీ పార్లర్ ఇటీవల ప్రారంభమైంది. అట్లాంటా బ్రాహ్మిణ్ సమాజ్ ప్రెసిడెంట్ పూనమ్ థాకర్, ‘మహారాణి ఆఫ్ అట్లాంటా’ లక్ష్మీ సాండ్.. ఈ బ్యూటీపార్లర్ను ఇటీవలే దులుత్లో ప్రారం భించారు. ఎంతో అట్టహాసంగా ఈ ప్రారంభ వేడుకను నిర్వ హించారు.
స్వప్నా బ్యూటీపార్లర్.. గ్లామర్ రంగంలో తన ముప్పై సంవత్సరాల అనుభవాన్ని రంగరించి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సేవలు అంది స్తోంది. తమ అందాలకు మరిన్ని మెరుగులు దిద్దించు కునేందుకు ఎందరో ప్రముఖులు, సెలబ్రిటీలు ఇక్కడకు రావడం సర్వసాధారణం. యూఎస్లో పేరొందిన బ్యూటీ పార్లర్లలో స్వప్నా బ్యూటీ పార్లర్ ఒకటి. ఇక్కడ అందించే ‘అందమైన’ సేవల కోసం భారతీయ అమెరికన్ మహిళలతో పాటు, అమెరికన్ మహిళలు క్యూ కడతారంటే అతిశయోక్తి కాదు. అందాన్ని, ఆకర్షణను రంగరించి అతివల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే ‘స్వప్నా బ్యూటీపార్లర్’.. థ్రెడింగ్, వాక్సింగ్, ఐలాష్, ఐబ్రో టింట్, ఫేసియల్స్ వంటి సేవలను అందిస్తోంది. అలాగే, కేశ సంరక్షణ, హెయిర్ కేర్కు సంబంధించిన అన్ని రకాల సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. యువతులు.. స్వప్నా బ్యూటీపార్లర్లో హీనా టాటూస్ వేయించుకోవడాన్ని ప్రెస్టీజ్గా ఫీలవుతారు. ఇక, వధువు అలంకరణకు సంబంధించిన బ్రైడల్ వర్కస్ను కూడా స్వప్నా బ్యూటీపార్లర్ నిర్వాహకులు ఆఫర్ చేస్తున్నారు.
గ్లామర్ రంగంలోని ఆధునిక, సాంకేతిక పద్ధతులను.. భారతీయ సంప్రదాయం ప్రకారం అందించడం స్వప్నా బ్యూటీపార్లర్ ప్రత్యేకత.
అందంగా ఉండటం వేరు. అందంగా కనిపించడం వేరు. ఈ రెండు భావనలను రంగరించి.. తన కస్టమర్లకు అందమైన సర్వీసును అందిస్తూ ఆకట్టుకుంటూ, ఆకర్షిస్తోంది.. స్వప్నా బ్యూటీపార్లర్.
మీ అందానికి మెరుగులు దిద్దించుకోవాలని అనుకుంటున్నారా?
అందానికి తోడు మరింత ఆత్మవిశ్వాసంతో కనిపించాలని భావి స్తున్నారా? అయితే.. ఛలో ‘స్వప్నా బ్యూటీపార్లర్’.
-రాజేశ్వరి అన్నవరపు
Review అందమైన ‘స్వప్నం’ అందరికీ సొంతం..