ఆయుర్వేదంలో నిద్ర ప్రాధాన్యం గురించి ఇలా చెప్పారు`
నిద్రాయత్తం సుఖం దు:ఖం
పుష్టి కార్శం బలాబలమ్
వృషతా క్లీ బతా జ్ఞానం అజ్ఞానం
జీవితం న చ
తస్మాత్ హితా హితం స్వప్నం
బుద్వా స్వప్నాత్ సుఖం బుధ:
సుఖం ` దు:ఖం, వృద్ధి `క్షీణత, బలం` దుర్బలం, పుంస్త్వము` నపుంసకత్వం, తెలివి` తెలివిలేమి, చావు` బతుకు.. ఇవన్నీ నిద్రకు ఆధీనములై ఉన్నాయి. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు నిద్ర యొక్క హితాహితములనెరిగి నిద్రించాలి.
మాసిన బట్టలు ధరించువాడిని, దంతములు సరిగా తోముకొనని వాడిని, తిండిపోతును, నిష్టూరములు ఆడువాడిని, పొద్దెక్కిన తరువాత సంధ్యవేళ నిద్రించువాడిని.. వాడెంత విష్ణుమూర్తి వాడంతటి వాడైనా కూడా.. లక్ష్మీదేవి వదిలి వెళ్లిపోతుంది. ఇక్కడ లక్ష్మి అంటే` ఆయురారోగ్యములు, ఐశ్వర్యాదులు అని భావం.
నియమిత వేళలో చక్కగా నిద్రించాలి. వేళగాని వేళలో నిద్రించడం వల్ల పెక్కు రోగాలు దరిచేరుతాయని ఆయుర్వేదం చెబుతోంది.
Review ఆయుర్వేదం.. నిద్రా విధి.