చక్కని నిద్ర.. ఆరోగ్య ముద్ర

అలసిన మనసుకు కాసింత విశ్రాంతి లభించేది నిద్రలోనే. నిద్ర సరిగా లేకపోతే ఆ మర్నాడు రోజంతా చికాకుగానే ఉంటుంది. ఏ పనిపైనా ఏకాగ్రత చూపలేం. అదే కంటి నిండా నిద్రపోతే తెల్లారి పనులన్నీ సవ్యంగా చేయగలుగుతాం. చేసే పనిపై మనసు నిలపగలుగుతాం. సరైన నిద్రలేకపోతే శారీరకంగానూ, మానసికంగానూ కూడా అనేక అనర్థాలు తలెత్తుతాయి.

ఏ వయసు వారికైనా రాత్రిపూట తగినంత నిద్ర లేకపోవడం చాలా పెద్ద ఆరోగ్య ప్రమా దాలకు దారి తీస్తుంది. నిద్ర పట్టక పోవడానికి అనేక కారణాలు ఉంటాయి. నిద్ర సరిగా పట్టని వారు రాత్రంతా అటుఇటూ దొర్లుతారు. నిద్ర రాదు. కలత నిద్రగా ఉంటుంది. మెలకువ వచ్చి మళ్లీ నిద్రపోవడం జరగదు. కొంతమంది అతిగా టీవీల దగ్గర, కంప్యూటర్ల దగ్గర ఉండి లేదా ఇంటర్నెట్‍లో వివిధ సైట్లు వీక్షిస్తూ, డిటెక్టివ్‍ పుస్తకాలు చదువుతూ నిద్రపోరు. ఒకవేళ పడుకునే ముందు చదివే అలవాటు ఉన్న వారు మంచి పుస్తకాలను, మనసుకు మంచి అనుభూతి కలిగించే పుస్తకాలను చదవాలి. చదివే అలవాటు ఉందని అశ్లీల పుస్తకాలు, ఉద్విగ్నం కలిగించే పుస్తకాలు పడుకునే ముందు చదివితే అది నిద్రపై చెడు ప్రభావం చూపుతుంది. సాధ్యమైనంత వరకు పడుకునే ముందు టీవీ చూడకపోవడం ఉత్తమం.
ఏ విధంగానైనా సరే ఎక్కువ కాలం నిద్ర పట్టని పరిస్థితి కొనసాగుతుంటే కనుక అది శరీరంలో చోటుచేసుకునే మార్పులకు సంకే తంగా భావించాలి. తగినంత నిద్ర లేకపోతే శరీరం అలసిపోతుంది. విశ్రాంతి ఉండదు. అది దీర్ఘకాలంలో అనేక అనారోగ్యాలకు దారి తీస్తుంది.

తగినంత నిద్ర లేకపోతే….

రాత్రి సరిగా నిద్రపట్టని వారు పగలంతా అన్యమనస్కంగా ఉంటారు.
ఇతరులతో సరిగా ప్రవర్తించలేరు.
పగలంతా మత్తుగా జోగుతూ ఉంటారు.
పని మీద దృష్టి నిలపలేరు. తప్పులు చేస్తారు.
చేసే పనిపై ఏకాగ్రత చూపలేరు.
కోపం, చిరాకు పెరుగుతాయి.
బీపీ పెరుగుతుంది. ఇటువంటి వారిలో వయసు పెరిగే కొద్దీ మధుమేహం వచ్చే శాతం ఎక్కువ.
తగినంత నిద్ర లేకపోతే శరీరం లోపలి అవయవాల పనితీరు గతి తప్పుతుంది.
పగలంతా చికాకుగా ఉండటం వలన సామా జిక సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది.
మూడ్‍ బాగా ఉండదు.
వృత్తి నైపుణ్యం తగ్గిపోతుంది.
ఆడవారైతే ఇంటి పనుల్లో పొరపాట్లు జరుగుతుంటాయి.
సంసార బాంధవ్యాలలోనూ విభేదాలు వస్తాయి.
సరిగా నిద్రపోకుంటే ఇన్ని రకాల ఇబ్బం దులు ఉన్నాయి.

రాత్రిళ్లు నిద్రపట్టకపోవడానికి కారణం..

శరీరం బలహీనం కావడం, ఒత్తిడి, డిప్రెషన్‍ (కుంగుబాటు) ఉన్న వారికి నరాలు, కండరాలు త్వరగా అలసిపోతాయి.
హార్మోన్స్ సమతుల్యత ఉండే వారికైతే బాగా పనిచేస్తే నిద్ర బాగా పడుతుంది.
కానీ, పై వ్యాధులు ఉన్న వారు సాయంత్రం ఎక్కువ పనిచేసి అలసిపోతే నిద్ర సరిగా పట్టదు.
ఇటువంటి వారికి ఒక పక్క మనసుకు నిద్ర వస్తుంటే మరోపక్క శరీరంలో అలజడి, ప్రకంపనలు అధికంగా ఉంటాయి.
గ్లూకోజ్‍, పొటాషియం, ఇతర విటమిన్లు సరిగా నరాలకు, కండ రాలకు అందకపోవడం, అరగని వస్తువులను తినడం, నరాలను ఉద్రేకపరిచే ఆహారం
తీసుకోవడం, టీవీలో బాగా ఇష్టం కలిగి పోగ్రామ్స్, యాంగ్జయిటీతో చూడటం వంటివి కూడా నిద్ర సరిగా రాకపోవడానికి కారణం.
నిద్ర సరిగా రావడం లేదని నిద్ర మాత్రలు మింగే కంటే సెలైన్‍ లేదా అరటిపండు ఉడకబెట్టి జ్యూస్‍లా చేసుకుని తాగడం ఉప శమనం కలిగించవచ్చు.

నిద్ర రావడం లేదా?

మానసిక అశాంతి వలన సరిగా నిద్రరాదు. అధికంగా అలసి పోవడం, సరైన విధంగా ఆహారం తీసుకోకపోవడం, మలబద్ధకం,మానసిక అలసట, ఎక్కువగా చింతించడం, అనారోగ్యం మొదలైన కారణాల వల్ల కూడా రాత్రిళ్లు సరిగా నిద్ర పట్టదు. అధిక ధూమపానం, అధిక మద్యపానం వలన కూడా సరిగా నిద్రరాదు. ఇటువంటి వారికి చిన్నపాటి శబ్దానికే మెలకువ వచ్చేస్తుంది. అటుపై ఎంత గింజుకున్నా కంటిపై కునుకు రాదు. ఫలితంగా ఉదయానికి శరీరం బాగా అలసి పోయినట్టయి రోజంతా బద్ధకంగా ఉంటుంది.

మంచి నిద్రకు గృహ చికిత్సలు

రాత్రి పడుకునే ముందు వేడినీళ్లతో కాళ్లు, చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. పాదాలకు ఆవాల నూనె (మస్టర్డ్ ఆయిల్‍)తో మాలిష్‍ చేసుకోవాలి. దీనివల్ల సుఖనిద్ర కలుగుతుంది.
ఆవాల నూనెలో పచ్చ కర్పూరం కలిపి తలకు మర్దన చేసుకున్నా కూడా మంచి నిద్ర కమ్ముకొస్తుంది.
రెండు టేబుల్‍ స్సూన్‍ల తేనె, ఒక స్పూన్‍ ఉల్లిపాయ రసం కలిపి తీసుకోవాలి.
బొప్పాయి కూర లేదా బొప్పాయి పండ్లను ఆహారంగా ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మంచి నిద్ర వస్తుంది.
ఉసిరికాయ రసం + జాజికాయ చూర్ణం కలిపి తీసుకుంటే కమ్మనైన నిద్ర మీ సొంతం అవుతుంది.
కొద్ది నీళ్లలో జాజికాయను రుద్ది (బండపై నూరాలి) ఆ రసాన్ని కనురెప్పలపై రాస్తే.. మంచి నిద్ర వస్తుంది.
తేనె + జాజికాయ చూర్ణం కలిపి తీసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ మిశ్రమం అలసటను పోగొడుతుంది. చికాకును తొలగిస్తుంది.
రాత్రి పడుకునే ముందు తాజా గోరింటాకుల పేస్టులను పాదాలకు పట్టించినా కూడా మంచి ఫలితం ఉంటుంది.
పెరుగు లేక మజ్జిగ + నల్ల ఉప్పు + సోంపు + మిరియాల పొడి + పటిక బెల్లం కలిపి ఆ మిశ్రమాన్ని తాగాలి.
రాత్రి భోజనం పది గంటల లోపు పూర్తి కావాలి. తక్కువగా తినాలి. అరగని ఆహార పదార్థాలను తీసుకోకూడదు. తేలికగా జీర్ణమయ్యే పదార్థాలనే రాత్రి
పూట తినాలి. అలాగే తిన్న తరువాత కొద్దిపాటి శారీరక శ్రమ కూడా అవసరం.

ఎలా పడుకుంటున్నారు?

అమెరికన్‍ అకాడమీ ఆఫ్‍ స్లీప్‍ మెడిసిన్‍ పరిశోధకులు.. ప్రతి రోజూ ఏడెనిమిది గంటల నిద్ర ప్రతి మనిషికీ అవసరమని, ఇది ఆరోగ్యకర మైన దినచర్యకు ఉపకరిస్తుందని తేల్చారు. నిద్ర పట్టకపోవడం లేదా నిద్రపోకపోవడం అనేది దీర్ఘకాలంలో అనేక అనారోగ్యాలకు దారి తీస్తుందని వీరు హెచ్చరిస్తున్నారు. మంచి నిద్రకు వారు కొన్ని సూచనలు కూడా చేశారు.
పొగతాగే అలవాటును పూర్తిగా మానుకోవాలి.
పడకగది ప్రశాంతంగా, నిర్మలంగా ఉండేలా చూసుకోవాలి. మరీ చల్లగానూ, మరీ వేడిగానూ కాకుండా ఉండాలి. నిద్ర వేళ ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి.
సాయంత్రం వేళల నుంచే కాఫీలు, టీలను, కెఫిన్‍ ఎక్కువగా ఉండే కూల్‍డ్రింక్స్ను తీసుకోరాదు.
రాత్రి పూట గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
ప్రతీ రోజూ నిర్ణీత వేళకు నిద్రపోవాలి.
నిద్రకు ఉపక్రమించే ముందు టీవీలో ఉద్వేగం కలిగించే దృశ్యాలున్న సినిమాలు, సీరియళ్లు చూడకూడదు.
రాత్రి బాగా నిద్రపట్టాలంటే పగలు కనీసం అరగంట పాటైనా పగటి వెలుగులో గడపాలి. మసక వెలుగు ఉండే బెడ్‍రూమ్‍లలో గడిపే వారికి రాత్రి సరిగా నిద్రరాదు.
నిద్రకు ముందు ఆహ్లాదకరమైన సంగీతం వినాలి. లేదా మంచి పుస్తకాలు చదవాలి. అయితే పుస్తకాలు చదివేటపుడు మరో జాగ్రత్త కూడా తీసుకోవాలి. ఎందుకంటే నిద్రకు దూరమై పూర్తిగా పుస్తక పఠనంలో లీనమైపోయే అవకాశం ఉంది. కాబట్టి మంచి మ్యూజిక్‍ వినడం మేలు.
గోరువెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్‍ అనే అమైనో ఆసిడ్‍ ఉంటుంది. ఇది మంచి నిద్రకు ఉపకరిస్తుంది.
నిద్ర వ్యవధి ఎంత ముఖ్యమో, నిద్ర తీరు కూడా అంతే ముఖ్యం. నిజానికి మీరు పడుకునే తీరు ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. మీ చర్మాన్ని యవ్వనంతోనూ, ఆరోగ్యవంతంగానూ ఉంచడంలో పడుకునే తీరు కూడా ప్రభావం చూపుతుంది.
వెల్లకిలా పడుకుంటే శ్వాస సమస్యలు తలెత్తుతాయి.
కుడివైపు తిరిగి పడుకుంటే జీర్ణక్రియ సమస్యలకు కారణమవుతుంది.
ఎడమ వైపు తిరిగి పడుకునే భంగిమ ఉత్తమమైనదిగా అనేక పరిశోధనల్లో తేలింది. ఎడమమైపు తిరిగి పడుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.

Review చక్కని నిద్ర.. ఆరోగ్య ముద్ర.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top