చాక్లెట్ ఫ్లేవర్…రుచి సూపర్

చాక్లెట్‍ కుకీస్‍
కావాల్సినవి:
ఓట్స్- 3 కప్పులు
పీనట్‍ బటర్‍- అర కప్పు
వెన్న- అర కప్పు
కొకోవా పౌడర్‍- పావు కప్పు
పాలు- అరకప్పు
పంచదార- ఒకటిన్నర కప్పులు
వెనీలా ఎక్స్ట్రాక్ట్- ఒక టీ స్పూన్‍
ఉప్పు- పావు టీ స్పూన్‍
తయారు చేసే విధానం: మందపాటి మూకుడులో పంచదార, కొకోవాపౌడర్‍ వేసి రెండూ బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. తరువాత పాలు, వెన్న వేసి బాగా కలిపి, సన్నటి మంట మీద ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తరువాత స్టవ్‍ మీద నుంచి దించి వెంటనే ఈ మిశ్రమంలో ఓట్స్, వెనీలా ఎక్స్ట్రాక్ట్, ఉప్పు, పీనట్‍ బటర్‍ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని టేబుల్‍ స్పూన్‍తో వ్యాక్స్ పేపర్‍ మీద వేసుకుని, నచ్చిన ఆకారంలో కుకీస్‍ను తయారు చేసుకోవాలి. పావుగంట సేపు వాటిని అలాగే విడిచి పెడితే, అవి క్రమంగా గట్టిబడి కరకర లాడే చాక్లెట్‍ కుకీస్‍ రెడీ.

చాక్లెట్‍ ఫుడ్డింగ్‍
కావాల్సినవి: డార్క్ చాక్లెట్‍ తురుము- ఒక కప్పు, మీగడ- ఒకటిన్నర కప్పులు, వెన్న- పావు కప్పు, కొకోవా పౌడర్‍- రెండు టేబుల్‍ స్పూన్లు, పంచదార- రెండు టేబుల్‍ స్పూన్లు, వెనీలా ఎక్స్ ట్రాక్ట్- ఒక టీ స్పూన్‍, ఉప్పు- పావు టీ స్పూన్‍, జీడిపప్పు ముక్కలు- అర టీ స్పూన్‍
తయారు చేసే విధానం: మందపాటి మూకు డులో మీగడను వేసుకుని, స్టవ్‍ మీద సన్నటి మంటపై ఉడికించుకోవాలి. మీగడ బాగా ఉడికిన తరువాత మూకుడును దించేసుకుని, అందులో కొకోవా పౌడర్‍ వేసుకుని బాగా గిలకొట్టాలి. ఈ మిశ్రమంలో చాక్లెట్‍ తురుము, వెన్న, పంచదార, వెనీలా ఎక్స్ట్రాక్ట్, ఉప్పు వేసుకుని మిశ్రమం అంతా మెత్తగా అయ్యే వరకు మళ్లీ గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని కప్పులలో ముప్పావు వంతు వరకు నింపుకోవాలి. పైన జీడిపప్పు ముక్కలను చల్లుకుని, ఫ్రిజ్‍లో పెట్టాలి. ఫ్రిజ్‍లో ఆరు గంటల పాటు ఉంచిన తరువాత చల్లచల్లని తీయతీయని నోరూరించే చాక్లెట్‍ పుడ్డింగ్‍ రెడీ.

చాక్లెట్‍ ఓట్‍ మీల్‍ బార్స్
కావాల్సినవి: ఓట్స్- రెండు కప్పులు, తేనె- పావు కప్పు, కొకోవా పౌడర్‍ – పావు కప్పు, పీనట్‍ బటర్‍- పావు కప్పు, వెన్న- పావు కప్పు, వెనీలా ఎక్స్ట్రాక్ట్- అర టీ స్పూన్‍, బాదం తురుము- ఒక టీ స్పూన్‍, కిస్మిస్‍- ఒక టీ స్పూన్‍, చాక్లెట్‍ చిప్ప్- ఒక టీ స్పూన్‍,
త•యారు చేసే విధానం: దాదాపు ఎనిమిది అంగుళాల చతురస్రాకారపు పాత్రను తీసు కోవాలి. పాత్ర అడుగు భాగాన వ్యాక్స్ పేపర్‍ను పరచుకోవాలి. ఒక బౌల్‍లో పీనట్‍ బటర్‍, వెన్న, తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్‍పై సన్నటి మంట మీద వేడి చేసుకోవాలి. పీనట్‍ బటర్‍, వెన్న కరుగుతుండగా, వెనీలా ఎక్స్ట్రాక్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మిశ్రమం బాగా మెత్తగా తయారయ్యాక ఓట్స్, కొకోవా పౌడర్‍ వేసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వ్యాక్స్ పేపర్‍ వేసి ఉంచిన చతురస్రాకారపు పాత్రలోకి వేసుకుని, సమంగా పరుచుకునేలా స్పూన్‍తో వీలైనంత గట్టిగా అదుముకోవాలి. తరువాత ఈ మిశ్రమంపై బాదం తురుము, కిస్మిస్‍, చాక్లెట్‍ చిప్స్ చల్లుకుని, మళ్లీ గట్టిగా అదుముకోవాలి. మిశ్రమం చల్లారాక, చతురస్రాకారపు పాత్రను డీప్‍ ఫ్రిజ్‍లో పెట్టుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత బయటకు తీసి, కోరుకున్న సైజులో బార్స్ కట్‍ చేసుకోవాలి. నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ బార్స్ చాలా రుచిగా ఉంటాయి.

Review చాక్లెట్ ఫ్లేవర్…రుచి సూపర్.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top