మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక
ఏది మేలు
గడపలన్నింటోను
ఏ గడప మేలు
మహలక్ష్మి నర్తించు
మా గడప మేలు
అరుగులన్నింటిలోను
ఏ అరుగు మేలు
అతిథులందరు జేరు
మా గడప మేలు
వీధులన్నింటిలోన
ఏ వీధి మేలు
విద్వాంసులుండేటి
మా వీధి మేలు
ఊరులన్నింటిలోనూ
ఏ ఊరు మేలు
పాడిపంటలు విలసిల్లు
మా ఊరు మేలు
గురువులందరిలోనూ
ఏ గురువు మేలు
వేదసారము తెలుపు
మా గురువు మేలు
ఉడుకు పండ్లు
నేరేడు చెట్టుపై
దోరకాయలు తింటు
బారాటి పిల్లోడు
కూరుచుండున్నాడు
మహధ్యాహ్న పెండమల
మలని మాడుస్తుంటె
భూమంత నిప్పులో
పొరలాడి నట్టుంది
అప్పుడొక ముసలాబి
డాదారె పోతుండి
‘బాబయ్య! నా కొక్క
పండు పడవే’తంది
పిల్లవాడు
‘చల్ల చల్లని పండు
జల జలా రాల్చేద
వెచ్చ వెచ్చని పండ్లు
విసరి పడవేసెద’
ముసలమ్మ
‘వెచ్చన్ని పండ్లేటి?
విడ్డూరు మటైతె
ఉడుకుడుకు పండ్లనే
పడవేయి చూతాము’
అలగానె పిల్లవా
డల్లంత దూరాన
కిసుకలో పడునట్లు
విసిరాడు పండ్లిన్ని
పండ్లకై ముసలమ్మ
పడుతు పడుతూ పోయి
ఒకటి రెండేరుకుని
ఊదుకోసాగింది
పిల్లవాడు
‘ఉప్పుప్పుమనుకొంటు
ఊదుతా వేమవ్వ!
అంతుడుకుగా నున్న
వా? యేటి చెప్పవూ?’
ముసలమ్మ
‘‘ఉడుకేటి పిల్లోడ?
చెడ గాలిపోతుంటే!’
పిల్లవాడు
‘కాబట్టె నల్లబడి
కమలి పోయిన వవ్వ!
మండు పొట్టకు వేడి
పండు పడవేస్తివా?
ఉడుకుడుకుతో చల్ల
పడిపోత’దన్నాడు.
అవ్వ నవ్వుతూ ‘మన్మ
డా! కొంటె వో’ యంది
మనమ‘డైతే నీవు
మంచవ్వ’వన్నాడు
Review పిల్లల ఆటపాటలు.