తొందరపాటు

ఒక వర్తకుడు జాతరలో తన సరుకునంతా అమ్మి బాగా సొమ్ము చేసుకున్నాడు. సంచులన్నీ డబ్బు లతో బరువెక్కిపోయాయి. జాతర ముగిసిన తరువాత చీకటి పడక ముందే ఇల్లు చేరాలని నిర్ణయించు కున్నాడు.

మధ్యాహ్నమంతా ఒక పట్టణంలో విశ్రాంతి తీసుకున్నాడు. అతను ఇక బయలు దేరుదానుకునే సమయానికి అతని పనివాడు వర్తకుడి గుర్రాన్ని వెంటబెట్టుకుని వచ్చి ఇలా అన్నాడు-

‘అయ్యా! గుర్రం ఎడమ గిట్టలో ఒక మేకు ఉండిపోయింది. ఇప్పుడేం చేద్దాం!’ అని అడి గాడు.

అందుకు ఆ వర్తకుడు ‘ఉండనివ్వురా. ఏం కాదులే’ అని జవాబిచ్చి, అంతటితో ఊరు కోకుండా, ‘నేను ఇంకా ఆరు మైళ్ల దూరం వెళ్లాలి. నేను కొంచెం తొందరగా ఉన్నాను. నా గుర్రానికి నన్ను సవ్యంగా ఇల్లు చేర్చే సత్తా ఉంది’ అన్నాడు.

సాయంత్రం వేళ పనివాడు ఒక సత్రం దగ్గర మళ్లీ వర్తకుడిని కలిసి ‘అయ్యా! గుర్రం ఎడమ గిట్ట నాడా ఊడిపోయింది. నేను దానిని కంసాలి వద్దకు తీసుకువెళ్లాలా?’ అని ప్రశ్నించాడు.

‘దాన్నలాగే ఉండనివ్వరా బాబూ! నా గుర్రం మరో రెండు మైళ్లు నన్ను మోయలేదా? నేను కాస్త తొందరలో ఉన్నాను కదా!’ అని వర్తకుడు పనివాడికి బదులిచ్చాడు.

అలాగే ఆ గుర్రంపై వర్తకు ప్రయాణం సాగించాడు. కానీ కొద్ది దూరం ప్రయాణించాక గుర్రం కుంటడం మొదలుపెట్టింది. మెల్లిగా కుంటడం మొదలుపెట్టి చివరకు ఒకచోట కూల బడిపోయింది. హఠాత్తుగా గుర్రం కూలబడి పోవడం వల్ల గుర్రం కాలు విరిగిపోయింది. అంతే! వర్తకుడు బిత్తరపోయాడు. గుర్రాన్ని అక్కడే వదిలేసి, సంచులన్నీ మోసుకుంటూ, రొప్పుతూ నడుస్తూ ఇంటికి చేరాడు.

వర్తకుడు తన పనివాడి మాట విని గుర్రానికి గిట్టలకు నాడాలు వేయించినట్టయితే ఆ బాధలు తప్పేవి కదా!
సమయస్ఫూర్తితో మెలుగుతూ, చేయాల్సిన పనిని తగిన సమయంలో పూర్తి చేస్తే ఎలాంటి ఆపదలూ, ఇబ్బందులూ ఏర్పడవు.
పిల్లలు నేర్చుకోవాల్సిన

నీతి: అందుకే, పిల్లలూ! చేసే పనిపై మనసు లగ్నం చేయండి. తొందరపాటు కూడదు. ఇలా చేయడం వల్ల అన్ని పనులూ అనుకున్న సమయంలో సవ్యంగా పూర్తవుతాయి. ఇలా చేయడం వల్ల అద్భుతాలు చేయడం ఏమంత కష్టం కాదు.

Review తొందరపాటు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top