బాలలం మేమొక్కటే

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక

పపంచ బాలల గీతం
ఎల్లలెరుగని వాళ్లము – కల్లలెరుగని వాళ్లము
బాలలం మేమొక్కటే – లోకమూ మాకొక్కటే
గోధుమ రంగున కొందరు – పసుపు వన్నె ఇంకొందరు
తెలుపు, నలుపు, ఆపిల్‍ ఎరుపూ
ఏ రంగైనా ముచ్చట గొలుపూ
రంగేదైనా, రూపేదైనా నివసించే ఆ చోటేదైనా
బాలలం మేమొక్కటే – లోకమూ మాకొక్కటే
అన్నం, పప్పు, చారు, కూర – శాకాహారం అనువారైతే
గుడ్డూ, చేపా, కోడికూరా – మాంసాహారం అనువారైతే
తిండేదైనా, తీరేదైనా – తినగోరే ఆ రుచులేవైనా
బాలలం మేమొక్కటే – లోకమూ మాకొక్కటే
అవునందురు, ఎస్‍ అందురు కొందరు
ఒకే, టాటా అందురు కొందరు
సీ, దేఖో, జా అంటూ కొందరు
పలు విధాలుగా పలుకుచుందుకు
మాటేదైనా, పాటేదైనా- పెదాలు కలిపే భాషేదైనా
బాలలం మేమొక్కటే
లోకమూ మాకొక్కటే
దేశాలు వేర్వేరైనా కానీ – సందేశం మాదిదే
ఇదే సంతోషంతో సకల ప్రపంచం – పకపకలాడాలన్నదే
(ఇది యూనిసెఫ్‍ బాలల గీతం. దీనిని సుధామ తెలుగులోకి అనువదించారు)

తల్లీ భారతి
తల్లి భారతి వందనం – తల్లి భారతి వందనం
నీ ఇల్లే మా నందనం – మేమంతా నీ పిల్లలం
నీ చల్లని ఒడిలో మల్లెలం – తల్లిదండ్రులను గురువులను
ఎల్లవేళల కొలిచెదమమ్మా – తల్లిదండ్రులను, గురువులను ఎల్లవేళల కొలిచెదమమ్మా
చదువులు బాగా చదివిదెమమ్మా
జాతి గౌరవం పెంచెదమమ్మా – చదువులు బాగా చదివిదెమమ్మా
జాతి గౌరవం పెంచెదమమ్మా – కులమత భేదం మరచెదము
కలతలు మాని మెలగెదము – కులమత భేదం మరచెదము
కలతలు మాని మెలగెదము – మానవులంతా సమానులంటూ
మమతను సమతను పెంచెదము – తెలుగు జాతికీ అభ్యుదయం
నవభారతికే నవోదయం – తెలుగు జాతి అభ్యుదయం
నవభారతికే నవోదయం – భావి పౌరులం మనం మనం
భారత జనులకు జయం జయం – భావి పౌరులం మనం మనం
(దాశరథి)

Review బాలలం మేమొక్కటే.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top