చిలకమ్మ మేడలో కట్టే.. చింతాకు పుస్తె

చిలకమ్మ పెండ్లి
చిలకమ్మ పెండ్లి అని – చెలికత్తెలందరూ
చెట్టు సింగారించి – చేరి కూర్చున్నారు
పందిట పిచ్చుకలు – సందడి చేయగ
కాకుల మూకలు – బాకాలూదగ
కప్పలు బెకబెక – డప్పులు కొట్టగ
కొక్కొరోకోయని – కోడి కూయగా
ఝమ్మని తుమ్మెద – తంబుర మీటగ
కుహుకుహూయని – కోయిల పాడగా
పిల్లతెమ్మెరలు – వేణువూదగా
నెమలి సొగసుగా – నాట్యం చేయగా
సాలీడిచ్చిన చాపు కట్టుకొని
పెండ్లికుమారుడు బింకము చూపగా
మల్లీమాలతి – మాధవీలతలు
పెండ్లి కుమారుని – పెండ్లి కూతురిని
దీవిస్తూ తమ పూవులు రాల్చగా
మైనా గోరింక మంత్రము చదివెను
చిలకమ్మ మగడంత – చిరునవ్వు నవ్వుతూ
చిలకమ్మ మెడ కట్టే – చింతాకు పుసె..

రింగు రింగు బిళ్ల
రింగు రింగు బిళ్ల – రూపాయి దండ
దండ కాదురా – తామర మొగ్గ
మొగ్గ కాదురా – మోదుగ నీడ
నీడ కాదురా – నిమ్మల బావి
బావి కాదురా – బచ్చల కూర
కూర కాదురా – కుమ్మరి మెట్టు
మెట్టు కాదురా – మేదర సిబ్బి
సిబ్బి కాదురా – చీపురు కట్ట
కట్ట కాదురా – కావడి బద్ద
బద్ద కాదురా – బారెడు మీసం
మీసం కాదురా – మిరియాల పొడుం
పొడుం కాదురా – పోతురా

రంగులు
చందమామ తెలుపు – సన్నజాజి తెలుపు
మల్లెపువ్వు తెలుపు – మంచి మనసు తెలుపు
మందారం ఎరుపు – సింధూరం ఎరుపు
మంకెన పువ్వు ఎరుపు – మంట ఎరుపు
జీడిగింజ నలుపు – కట్టె బొగ్గు నలుపు
కారు చీకటి నలుపు – కాకమ్మ నలుపు
చామంతి పసుపు – పూబంతి పసుపు
బంగారం పసుపు – గన్నేరు పసుపు
సన్నజాజి తెలుపు – చామంతి పసుపు
మందారం ఎరుపు – కోకిలమ్మ నలు

Review చిలకమ్మ మేడలో కట్టే.. చింతాకు పుస్తె.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top