మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే..
అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక
పార్కుకెళ్లాము
స్కూలు నుంచి వచ్చాము
బుక్సు బ్యాగులో సర్దాము
స్నానం చక్కగ చేశాము
వెచ్చని పాలు తాగాము
నాన్న గారు వచ్చారు
లడ్డూ మిఠాయి తెచ్చారు
నాకు అన్నకు ఇచ్చారు
మంచి కథలు చెప్పారు
మార్కుల లిస్టు చూపితిమి
మంచి మార్కులు వచ్చినవనిరి
మెచ్చిన చోటుకు వెళ్దామంటిమి
నాన్నతో కలిసి పార్కుకు వెళితిమి
అక్కడ నేను చూశాను
కోతి జింకల ఆటను
ఇంకా దగ్గరికెళ్లాము
హాయిగా నవ్వుకున్నాము
సింహం వద్దకు వెళ్లాము
గాండ్రింపులు కూడా విన్నాము
వాటికి టాటా చెప్పాము
చక్కగ ఇంటికి వచ్చా
వెలుగులు
గోరంత దీపం కొండంత వెలుగు
మాయింటి పాపాయి మాకంటి వెలుగు
వెచ్చని సూరీడు పగలంతా వెలుగు
చల్లని చంద్రుడు రాత్రంతా వెలుగు
ముత్యమంత పసుపు ముఖమంతా వెలుగు
ముత్తయిదువ కుంకుమ బతుకంతా వెలుగు
గురువు మాట వింటే గుణమంత వెలుగు
మంచి చదువులు నీ భవిష్యత్తుకు వెలుగు
తెలుపు గేయం
అమ్మ మాట తెలుపు – ఆవు పాలు తెలుపు
మల్లెపూవు తెలుపు – మంచి మాట తెలుపు
చందమామ తెలుపు – సన్నజాజి తెలుపు
మంచి మనసు తెలుపు – పావురాయి తెలుపు
పంచదార తెలుపు – పాలు పెరుగు తెలుపు
గురువు గారి చొక్కా తెలుపు – గోవిందనామము తెలుపు
జాజిపూలు తెలుపు – జాబిల్లి తెలుపు
జాలిగుండె తెలుపు – చల్లనైన మంచు తెలుపు
వెన్నెలమ్మ తెలుపు – వేప పువ్వు తెలుపు
మంచి ముత్యం తెలుపు – పాపాయి నవ్వుతెలు.
Review గోరంత దీపం…. కొండంత వెలుగు.