
వరుణ్‌తేజ్ అంతరిక్ష కథాంశంతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా అంతరిక్షంలో ‘ఆకర్షణ’ చాలా తక్కువగా ఉంటుంది. ఆస్ట్రోనాట్లు కూడా ‘ఆకర్షణ’కు అంతే తక్కువగా ఉంటారు. అయితే, ఈ వరుణ్‌తేజ్ ఆస్ట్రోనాట్ మాత్రం ఆకర్షణ బలం గట్టిగా ఉన్నోడే. అందుకే కాబోలు ఈ చిత్రంలో అతని సరసన ఇద్దరు కథానాయికలను ఎంపిక చేశారు. ఈ ఆస్ట్రోనాట్ చివరకు ఎవరి ఆకర్షణకు గురయ్యాడనేది తెరపై చూడాల్సిందే. ‘ఘాజీ’ చిత్రంలో అందరి దృష్టిని ఆకర్షించిన సంకల్ప్‌రెడ్డి అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రం విశేషాలివి. అదితీరావ్ హైదర్‌ను ఆల్రెడీ ఓ హీరోయిన్గా ఎంపిక చేశారు. రెండో నాయికగా లావణ్య త్రిపాఠీని తీసుకున్నట్టు ఇటీవలే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. వరుణ్‌తేజ్ ‘తొలిప్రేమ’ సూపర్‌హిట్ తరువాత రానున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.
Review అంతరిక్షం’లో ఇద్దరు అమ్మాయిలతో...