
మామ్’ సినిమా జనాదరణ పొందడంతో శ్రీదేవి తరువాత ఏ ప్రాజెక్ట్ చేయబోతోందనేది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. ఇటీవల ఆమె ఏ ఫంక్షన్కు వెళ్లినా, ఎక్కడ కనిపించినా మీడియా అదే విషయాన్ని అడుగుతోంది. అయితే, దీనిపై ఆమె నోరు మెదపడం లేదు కానీ, శ్రీదేవి నెక్టస్ ప్రాజెక్టుకు ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా రెడీ అయినట్టు సమాచారం. గతంలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘మిస్టర్ ఇండియా’కు
సీక్వెల్గా ‘మిస్టర్ ఇండియా-2’ తెరకెక్కించడానికి ఆమె భర్త బోనీకపూర్ ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ టాక్. ఆమె సరసన
ఎవరు నటిస్తారనేది మరో చర్చ. మిస్టర్ ఇండియాలో హీరోగా నటించిన అనిల్కపూర్తోనే ఆమె జోడీ కడతారని అనుకొంటున్నారు. అనిల్ శ్రీదేవికి వరుసకు మరిది అవుతారు.
Review అతిలోకసుందరి రెడీ!.