
అది వదంతే…!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఆ మధ్య ఒక సినిమా ఆరంభమైనట్టు వార్తలొచ్చాయి. అయితే, ఇప్పటి వరకు అది పట్టాలెక్కలేదు. దీంతో ఆ సినిమా ఆగిపోయినట్టేనని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను లింగుస్వామి ఖండించారు. అల్లు అర్జున్‌తో తన చిత్రం తప్పక
ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం విశాల్‌తో ‘పందెంకోడి’ సీక్వెల్ నడుస్తోందని, అది కాగానే అర్జున్‌తో సినిమా ప్రారంభమవుతుందని ఆయన స్పష్టతనిచ్చారు.
Review అది వదంతే…!.