
నాని హీరోగా శివ నిర్వాణని దర్శకునిగా పరిచయం చేస్తూ, దానయ్య నిర్మిస్తున్న చిత్రం తెలిసిందే. ఇందులో నాని, నివేదా థామస్ హీరో హీరోయిన్లు. ఆది పినిశెట్టి కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం 80 శాతం షూటింగ్ అమెరికాలో జరుగుతుందని నిర్మాత దానయ్య తెలిపారు. ఆది పినిశెట్టిపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కి దర్శకుడు కొరటాల శివ కెమేరా స్విచాన్ చేయగా, వివి.వినాయక్ తొలి క్లాప్‌నిచ్చారు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ఎంటర్టైనింగ్గా సాగే సినిమా ఇది. ఆది పినిశెట్టితో కలిసి వర్క్ చేస్తున్నాను. నాకు మరో మంచి సినిమా అవుతుందని’ నాని తెలిపారు.
Review అమెరికాలో నాని చిత్రం.