అమెరికాలో మ్యూజిక్‍ సిట్టింగ్స్.

అమెరికాలో మ్యూజిక్‍ సెట్టింగ్స్ ఏమిటా అని ఆశ్చర్య పోతున్నారా? ఇదేదో హాలీవుడ్‍ మూవీ న్యూస్‍ కాదు. మన తెలుగు సినిమాకు సంబంధించినదే. అవును. నాగార్జున, నాని కథా నాయకులుగా వైజయంతి మూవీస్‍ పతాకంపై ఓ సినిమా రూపుదిద్దుకోబోతోంది. ఉగాది నాడే ముహూర్తం. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం అమెరికాలో సంగీత చర్చలు నడుస్తున్నాయి. గతంలో తన సంగీతంతో ఉర్రూతలూగించి.. ప్రస్తుతం రేసులో కాస్త వెనుకబడిన మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కావడం విశేషం. తన ఎంట్రీ బలంగా ఇచ్చేందుకు ఆయన ఈ సినిమాను వేదికగా చేసుకున్నారు. తన స్వరాలతో ఈ చిత్రాన్ని ఓ మెట్టు పైన ఉంచేలా శ్రమిస్తున్నారట. అవును మరి.. ఒకప్పుడు మణిశర్మ మ్యూజిక్‍ అంటే.. ఆ సినిమా పాటలన్నీ హిట్టేనని టాక్‍ నడిచేది. ఈ చిత్రంలోని మూడు పాటలకు సంబంధించి అమెరికాలో చర్చలు నడుస్తున్నాయి.

Review అమెరికాలో మ్యూజిక్‍ సిట్టింగ్స్..

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top