ఇంటికొకడు ఇలాంటోడు!

సాయిధరమ్‍తేజ్‍ హీరోగా దిల్‍ రాజు నిర్మిస్తున్న చిత్రం పేరు ‘జవాన్‍’. ‘దేశానికి జవాన్‍ ఎంత అవసరమో.. ప్రతి ఇంటికీ మా సినిమాలోని కథానాయకుడిలాంటి వాడు ఒకడు ఉండాల’ని ఈ చిత్రం ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నామని దర్శక నిర్మాతలు అంటున్నారు. ‘కొంతమంది కలిస్తే కుటుంబం అవుతుంది. కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే దేశం అవుతుంది. దేశభక్తి అంటే కిరీటం కాదు.. కృతజ్ఞత’ అనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా అందిస్తున్నారు. బీవీఎస్‍ రవి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సాయిధరమ్‍ భావోద్వేగాలతో, ఓ మధ్య తరగతి కుటుంబ సభ్యుడిగా కనిపించనున్నాడు.

Review ఇంటికొకడు ఇలాంటోడు!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top