తన మధుర గానంతో ఒకటీ రెండూ కాదు ఏకంగా లక్షకుపైగా పాటలు.. పద్నాల్గవ ఏట నుంచే నటనలో అభినివేశం.. ఇటు నటన.. అటు పాటలతో విజయవంతంగా కెరీర్‍ సాగిస్తున్న మనో (నాగూర్‍బాబు)తో ‘తెలుగుపత్రిక’ చిట్‍చాట్‍.
షహీదా, రసూల్‍ నా తల్లిదండ్రులు. ఇద్దరూ రంగస్థల కళాకారులే. మేం నలుగురు పిల్లల్లో నేనే చివరి వాడిని. అమ్మ షహీదా సత్యభామ, చింతామణి పాత్రలతో ఎంతో పేరు తెచ్చు కున్నారు. నాన్న రసూల్‍ హార్మోనిస్టు. ఐదారేళ్ల వయసు నుంచే నాటకాలకు అమ్మనాన్నతో వెంట వెళ్తుండేవాడిని. ఆయా నాటకాలకు పద్య సహ కారం అందించడం ద్వారా నాకు గానంపై ఆసక్తి ఏర్పడింది. అనంతరం బాల నటుడిగా ‘రంగూన్‍ రౌడీ’, ‘కేటుగాడు’ సినిమాల్లో నటించాను. ఎంఎస్‍ విశ్వనాథం గారి వద్ద సంగీత సహాయకుడిగా, సహాయ సంగీత దర్శకుడిగా కొన్నాళ్లు పని చేశాను. తర్వాత చక్రవర్తి గారి వద్ద చేరాను. రాజ్‍కోటి వద్ద చేరికతో నాకు టర్నింగ్‍ పాయింట్‍ వచ్చింది. 1984 చక్రవర్తి గారి ‘కర్పూరదీపం’ సినిమాలో రెండో హీరోకి వాయిస్‍ పాడాలన్నారు. బాలు, సుశీల గారితో పాటు నేను కూడా గొంతు కలి పాను. దీంతో సినిమా గాయకుడిగా నా ప్రస్థానం ప్రారంభమైంది. 1985లో నన్ను హంసలేఖ గారు, 1986లో ఇళయరాజా గారు తమిళ చిత్ర సీమకు పరిచయం చేశారు. అప్పటి నుంచి 25 వేల సినిమా పాటలను పాడాను. జానపద గీతాలు, భక్తి పాటలన్నీ కలిపి మరో 25 వేలకు పైగానే ఉంటాయి.
అమెరికా రావడం ఎలా అనిపిస్తోంది?
అమెరికా.. అందరి కలల డెస్టినేషన్‍. ఇక్కడి మనవారు కళలు, సంస్క•తీ సంప్రదాయాలపై ఎంతో అభిమానం చూపుతుంటారు. ఆ అభి మానమే మా వంటి కళాకారుల్ని ఇక్కడకు రప్పి స్తోంది. ఇక్కడి చాలామంది తెలుగు ఎన్‍ఆర్‍ఐలు తమ పిల్లలకు తెలుగు నేర్పించడం, తెలుగులోనే మాట్లాడటం వంటిని నాకెంతో ఆనందాన్ని కలి గించాయి.
మీకు బాగా గుర్తుండిపోయే అమెరికా టూర్‍ ఏది?
2013లో.. ఇళయరాజా గారు న్యూజెర్సీ తదితర నాలుగు చోట్ల మ్యూజికల్‍ నైట్స్ నిర్వ హించారు. ఎస్‍పీ బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర, ఇంకా 60-70 మంది ఆర్టిస్టులు వచ్చారు. ఈ పోగ్రామ్‍కు 15 వేల మందికి పైగా హాజ రయ్యారు. ఆ వేదికపై నేను గాత్రాన్ని పంచు కోవడం ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి.
మొదటిసారి అమెరికా ఎప్పుడు వచ్చారు?
1989లో. అక్కినేని నాగార్జున, టబు, అమలతో కలిసి అమెరికా టూర్‍కి ఫస్ట్ టైమ్‍ వచ్చాను. అప్పటి నుంచి ఏటా తెలుగు, తమిళ అసోసియేషన్ల పోగ్రామ్స్లో భాగంగా నిర్వహించే ప్రతి ఫంక్షన్‍కు వస్తున్నాను.
మీ కెరీర్‍లో మరిచిపోలేని సంఘటనలు ఏమైనా ఉన్నాయా?
బాల్యం నుంచే నేను ఫీల్డ్లో ఉన్నాను. అనేక మంది సీనియర్లతో కలిసి పనిచేశాను. కేవీ మహ దేవన్‍ గారి ఆధ్వర్యంలో ‘మా పల్లెలో గోపాలుడు’ చిత్రంలో, రాజేశ్వరరావు గారి వద్ద ‘తాండ్రపాపా రాయుడు’ సినిమాకు లతా మంగేష్కర్‍ గారితో కలిసి గాత్రం పంచుకోవడం మరిచిపోలేని జ్ఞాప కాలు. అలాగే, ఇంకా చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. నేను ఎన్టీఆర్‍ హయాంలో తెలుగుదేశం పార్టీ కోసం ఏడు నెలల పాటు ఏకధాటిగా పనిచేశాను. ‘చెయ్యెత్తి జైకొట్టు తెలు గోడా’ పాటను కంపోజ్‍ చేసింది మేమే. ఆ సమ యంలో ఎన్టీఆర్‍ ఒక్కోసారి ఏడెనిమిది గంటలు మాతో పాటే పాటల రికార్డింగ్‍ కోసం కూర్చుండి పోయేవారు. అలాగే, ఎన్టీఆర్‍ చివరి చిత్రం ‘మేజర్‍ చంద్రకాంత్‍’లో రెండు పాటలు పాడే అవకాశం రావడం కూడా మరిచిపోలేనిదే.
‘మనో’ మంచివాడు’ అని అందరూ అంటారట..
అవును. సన్నివేశాన్ని బట్టి మసులుకునే వారెవరైనా ఎందులోనైనా రాణిస్తారు. అణకువ, విధేయత, క్రమశిక్షణ చాలా ముఖ్యం. సొసైటీలో ఉన్నప్పుడు ఎదుటి వారి వ్రవర్తనకు అనుగుణంగా మనల్ని మనం మార్చేసుకోవాలి. సీరియస్‍గా
ఉంటే కష్టం. పరిస్థితిని బట్టి మసులుకోవడం ఇంపార్టెంట్‍. భావోద్వేగాలను సరిగా నియం త్రించుకోగలిగే వారే సమాజంలోనైనా, కుటుం బంలోనైనా, కెరీర్‍లోనైనా రాణిస్తారు.
అమెరికా వచ్చే యువతకు, ఇక్కడున్న యువతకు మీరు చెప్పే విషయం..?
ఎవరు ఎక్కడున్నా మన సంస్క•తిని, సంప్ర దాయాలను, విలువలను మరిచిపోకూడదు. ఎంత కష్టపడితే అమెరికా వెళ్లగలమో ప్రతి తల్లి దండ్రి తమ పిల్లలకు చెప్పాలి. కష్టం విలువను గుర్తించిన వారే సక్సెస్‍ కాగలుగుతారు.

Review .

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top