బాహుబలి’తో అందరి మనసు చూరగొన్న అనుష్క.. తనకు పెద్దగా కోరికలేం లేవని అంటోంది. ఫలానా పాత్ర చేయాలి, ఫలానా తరహా కథలో నటించాలనే హిట్‍లిస్టు ఏదీ తనకు లేదని చెబుతోంది. ప్రస్తుతం ఆమె ‘భాగమతి’లో నటిస్తోంది. ‘కెరీర్‍లో ఎన్నో ఊహించని పాత్రలు చేశాను. అవే నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. నిజానికి వాటిని నేనేం కోరుకోలేదు. మ అమ్మ నన్ను యువరాణి వంటి పాత్రల్లో చూడాలని ఉంది అని చెప్పేది. ‘రుద్రమదేవి’, ‘అరుంధతి’ వంటి చిత్రాల్లో నిజంగా యువరాణి పాత్రల్లో కనిపించా. ఇప్పుడు చేపలు పట్టే పాత్రలో చూడాలని అనుకుంటుందట. ఏమో.. అది కూడా జరిగిపోతుందేమో’ అంటోంది అనుష్క. ‘అందుకే మా అమ్మకు గట్టిగా చెప్పాను. నువ్వేదనుకుంటే అదే జరిగిపోతోంది. మునుముందు ఇంకేం కోరుకోకు అని’ అని ముక్తాయింపునిస్తోందీ నటీమణి.
చేపలు పట్టాలని అనుకుంటోందట!

Review చేపలు పట్టాలని అనుకుంటోందట!.